iDreamPost
android-app
ios-app

సెలక్ట్ కమిటీకి పేర్లు ఇచ్చిన తెలుగుదేశం.. తర్వాత జరిగేదేమిటి..?

సెలక్ట్ కమిటీకి పేర్లు ఇచ్చిన తెలుగుదేశం.. తర్వాత జరిగేదేమిటి..?

రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పరిపాలనా వికేంధ్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని కొద్దిరోజుల క్రితం శాసనమండలి చైర్మన్ రూల్ 154 కింద తన విచక్షణాధికారంతో బిల్లులు రెండిటిని సెలక్ట్ కమిటీకి పరిశీలనకు పంపుతున్నామని ప్రకటించారు. అయితే చైర్మన్ బిల్లులను సెలక్ట్ కమిటీ కి పంపిన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన ఈ ప్రక్రియ లో తాము బాగస్వామ్యులం కాబోమని అధికార పార్టీకి చెందిన శాసనమండలి సభానాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తో సహా ఆ పార్టీ ఎమ్మెల్సి ఉప సభాపతి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ ఆయా పార్టీలను లేఖల రూపంలో కోరిన మీదట మండలిలోని మిగతా పార్టీలైన తెలుగుదేశం, బిజెపి, పిడిఎఫ్ లు మండలి చైర్మన్లకి తమ తరపు ప్రతినిధుల పేర్లను మండలి చైర్మన్ కి పంపించారు. సెలక్ట్ కమిటీ లో మొత్తం 8 మంది సభ్యులుంటారు. వారిలో మండలిలోని ప్రస్తుత సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో కమిటీకి తెలుగుదేశం నుండి ఐదుగురు సభ్యులు, పిడిఎఫ్ నుండి ఒకరు, బిజెపి నుండి ఒకరు ఇలా రెండు బిల్లులకు కలిపి తెలుగుదేశం నుండి పది మంది సభ్యులు, పిడిఎఫ్ నుండి ఇద్దరు, బిజెపి నుండి ఇద్దరి పేర్లను అధికారికంగా మండలి చైర్మన్ కి పంపారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వికేంధ్రీకరణ బిల్లు కోసం అశోక్ బాబు, లోకేష్, తిప్పేస్వామి, బిటి నాయుడు, సంధ్యారాణి పేర్లను టిడిపి సెలక్ట్ కమిటీకి ఇచ్చింది. అదేవిధంగా సీఆర్డీఏ రద్దు బిల్లు పై సెలక్ట్ కమిటీ సభ్యులుగా దీపక్ రెడ్డి, బీదా రవి, బచ్చుల కృష్ణార్జునుడు, గౌరవాని శ్రీనివాసులు, బుద్దా నాగ జగదీశ్వరరావు పేర్లను ఖరారు చేసింది. బిజెపి నుండి అధికార వికేంధ్రీకరణ బిల్లు కు పి.మాధవ్ పేరు ని, సిఆర్డిఏ రద్దు బిల్లుకు సోము వీర్రాజు పేరును మండలి చైర్మన్ కి పంపింది. మండలిలో మరో విపక్షం పీడీయఫ్ కె.లక్ష్మణ రావు పేరును ని అధికార వికేంద్రీకరణ బిల్లు మరో ఎమ్మెల్సీ ఐలా వెంకటేశ్వర రావు పేరును సిఆర్డిఏ బిల్లుకు మెంబర్ గా సెలక్ట్ కమిటీకి పంపింది.

సెలక్ట్ కమిటి ఏర్పాటుకు బుదవారం వరకు గడువు వుందని చైర్మన్ తెలిపారు. మంగళవారం మండలిలో వివిద పార్టీలతో చైర్మన్ సెలక్ట్ కమిటి విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. బుధవారం రోజు ఈ కమిటీ పై చైర్మన్ నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. బుధవారం నాడు మండలి చైర్మన్ ఇచ్చే ఉత్తర్వుల మేరకు ఈ కమిటీలకు చైర్మన్ లుగా ఎవరున్నారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఐతే ఇప్పటికే అధికార పక్షం మండలి చైర్మన్ కు సహకరించే పరిస్థితి లేకపోవడం, మరొ వైపు చైర్మన్ రూల్స్ మరియు ప్రొసిడింగ్ ప్రకారం సెలక్ట్ కమిటి కి బిల్లు రాలేదనే వార్తల నేపధ్యంలో అసెంబ్లీ కార్యదర్శి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వివాదం నేపధ్యంలో రేపు ఎల్లుండిలొపు సెలక్ట్ కమిటి పై అధికార వర్గాల నుండి పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.