Idream media
Idream media
కరోనా పుట్టినిల్లు వుహాన్ నగరంలో వైరస్‌ను కట్టడి చేసి 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసి సంబరపడుతున్న వేళ చైనాను తాజాగా మరో కొత్త సమస్య వేధిస్తుంది.కరోనా వైరస్ నెగిటివ్‌తో ఆసుపత్రుల నుండి డిశ్చార్జి అయినా వ్యక్తులకు మరల పాజిటివ్ రావడం కలవరపెడుతోంది.సదరు వ్యక్తులలో జ్వరము, జలుబు,బాడీ పెయిన్స్ వంటి వైరస్ లక్షణాలు సైతం బహిర్గతం కాకపోవడం వైద్యులను ఆశ్చర్యపరుస్తుంది.
వైరస్ నయమై నిర్ధారణ పరీక్షలలో నెగెటివ్ వచ్చి ఇంటికెళ్లిన కొందరిలో 70 రోజులకు మళ్లీ పాజిటివ్‌గా తేలడం వైద్యులను ఆందోళన పరుస్తుంది. మరికొందరిలో నైతే 50-60 రోజులకే పాజిటివ్ వస్తుందని డాక్టర్లు తెలిపారు.కరోనా లక్షణాలు 14 రోజులలో బయట పడతాయనే అంచనాతో భారత్‌తో సహా అనేక దేశాలు రెండు వారాలపాటు అనుమానితులను క్వారంటైన్ చేస్తున్నారు. కానీ తాజాగా రెండోసారి లక్షణాలు బయటకి కనిపించకుండా 50-70 రోజుల మధ్య రోజుల పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వైద్యులను కలవరపెడుతోంది.రెండోసారి పాజిటివ్‌గా ఎందరున్నారో చైనా కచ్చితమైన వివరాలు వెల్లడించడం లేదు.
ఇక దక్షిణ కొరియా, ఇటలీలోనూ నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి కరోనా పాజిటివ్‌గా తేలుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా ప్రభావం ప్రపంచం నుంచి అంత తేలిగ్గా పోదని,వ్యాక్సిన్ కనుగొనే వరకూ సామాజిక దూరం వంటి జాగ్రత్తలు 2022 వరకూ అవలంబించాల్సి ఉంటుందని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సైతం అంచనా వేశారు ఇక తెలంగాణలో నిన్నటి నుంచి కరోనా అనుమానితులకు క్వారంటైన్‌ను 28 రోజులకు పెంచిన విషయం తెలిసిందే.