iDreamPost
android-app
ios-app

Zeekr: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఈవీ బ్యాటరీని తయారు చేసిన చైనా!

  • Published Aug 14, 2024 | 8:44 PM Updated Updated Aug 14, 2024 | 8:44 PM

Battery Charged In 10 Mins: చాలా ఎలక్ట్రిక్ కార్లు కొనలేకపోవడానికి కారణం.. ఛార్జింగ్ సమస్య. ఛార్జింగ్ పెట్టడానికి గంటల గంటల సమయం పట్టడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఓ కంపెనీ 10 నిమిషాల్లోనే ఛార్జింగ్ ఎక్కేలా సరికొత్త బ్యాటరీని తీసుకొస్తుంది.

Battery Charged In 10 Mins: చాలా ఎలక్ట్రిక్ కార్లు కొనలేకపోవడానికి కారణం.. ఛార్జింగ్ సమస్య. ఛార్జింగ్ పెట్టడానికి గంటల గంటల సమయం పట్టడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఓ కంపెనీ 10 నిమిషాల్లోనే ఛార్జింగ్ ఎక్కేలా సరికొత్త బ్యాటరీని తీసుకొస్తుంది.

Zeekr: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఈవీ బ్యాటరీని తయారు చేసిన చైనా!

చమురు వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పడ్డాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను, ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఉన్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పెట్టాలంటే ఐదారు గంటల సమయం పడుతుంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొనేందుకు వెనక్కి తగ్గుతున్నారు. చాలా మందికి ముఖ్యంగా బిజీ బిజీగా గడిపేవారికి సమయం అనేది చాలా విలువైంది. పెట్రోల్ బంకుల్లో నిమిషాల్లో ఫ్యూయల్ నింపుకుని వెళ్లిపోయేలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకునే కొన్ని కంపెనీలు వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీలను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ దిగ్గజ కంపెనీ 10 నిమిషాల్లోనే వేగంగా ఛార్జ్ అయ్యేలా ఒక బ్యాటరీని రూపొందించింది. ప్రపంచంలో ఇదే అత్యంత వేగవంతమైన బ్యాటరీ అని సదరు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.

చైనాకు చెందిన జీక్ర్ అనే కంపెనీ వేగంగా రీఛార్జ్ అయ్యే బ్యాటరీని తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీ అని చెబుతుంది. వేగంగా ఛార్జింగ్ అయ్యే బ్యాటరీలను టెస్లా కంపెనీ గతంలో చేసింది. అయితే టెస్లా కంటే కూడా తాము చేసిన బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవుతాయని చైనా కంపెనీ చెబుతుంది. టెస్లాకి చెందిన మోడల్ 3లో వాడే బ్యాటరీలు ఛార్జ్ అవ్వాలంటే 15 నిమిషాల సమయం పడుతుందని.. అదే తాము చేసిన బ్యాటరీలు పదిన్నర నిమిషాల సమయంలో 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతాయని జీక్ర్ కంపెనీ పేర్కొంది. మైనస్ పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ బ్యాటరీలు అంతే సమర్థవంతంగా పని చేస్తాయని తెలిపింది.

ఈ బ్యాటరీని సరికొత్త 2025 జీక్ర్ 007 సెడాన్ కారులో అమర్చారు. ఈ కారు వచ్చే వారం అందుబాటులోకి రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో టెస్లా ఛార్జింగ్ టెక్నాలజీ నంబర్ వన్ కాదని.. జీక్ర్ కంపెనీ చెప్పినట్టు ప్రపంచంలోనే వేగవంతమైన బ్యాటరీ అని.. సినో ఆటో ఇన్ సైట్స్ డైరెక్టర్ టూలీ వెల్లడించారు. ఈ జీక్ర్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీ చైనా కార్ల తయారీ దిగ్గజం గీలీ గ్రూప్ కి చెందిన సంస్థ. యూకేకు చెందిన లోటస్, స్వీడన్ కి చెందిన వోల్వో కంపెనీలు కూడా గీలీ గ్రూప్ కి చెందిన కంపెనీలే. కాగా జీక్ర్ కంపెనీకి చైనాలో 500 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని చైనా కంపెనీ భావిస్తుంది. 2026 నాటికి 10 వేల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను తమ నిర్వహణలో ఉంచుకునే దిశగా చైనా కంపెనీ అడుగులు వేస్తుంది.