iDreamPost
android-app
ios-app

ప్రజలకు గుడ్ న్యూస్..! త్వరలో అందుబాటులోకి మంకీపాక్స్‌‌‌‌కు వ్యాక్సిన్‌‌‌‌!

Mpox Vaccine In China: మూడేళ్ల క్రితం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మరో 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మంకీ పాక్స్ అనే మరో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ అందింది.

Mpox Vaccine In China: మూడేళ్ల క్రితం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మరో 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మంకీ పాక్స్ అనే మరో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ అందింది.

ప్రజలకు గుడ్ న్యూస్..! త్వరలో అందుబాటులోకి  మంకీపాక్స్‌‌‌‌కు వ్యాక్సిన్‌‌‌‌!

మూడేళ్ల క్రితం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మరో 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. ఈ కోవిడ్ వల్ల కొన్ని లక్షల మంది మృతి చెందారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డాయి. ఆ సమయంలో విధించిన లాక్‌ డౌన్‌ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఈ కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం దీన్నుంచి కోలుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచం ముంగిట మరో ప్రమాదం వచ్చి చేరింది. మంకీ పాక్స్ అనే మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని విషయంలో ప్రపంచ దేశాలకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. మంకీ పాక్స్ నిర్మూలనకు వ్యాక్సిన్ రెడీ అయ్యింది. మరి.. ఎక్కడ తయారు చేశారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మంకీపాక్స్‌‌‌‌ కట్టడికి చైనా దేశం వ్యాక్సిన్‌‎ను అభివృద్ధి చేసింది. ఆ దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ చైనా నేషనల్ ఫార్మసూటికల్ గ్రూప్ (సినోఫార్మ్) ‘ఎంపాక్స్’ పేరిట మంకీపాక్స్‌‌‌‌కు వ్యాక్సిన్  అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, రష్యా దేశాల్లో మంకీపాక్స్‌‌‌‌ టీకా అందుబాటులో ఉంది. అయితే, చైనా నుంచి తయారవుతున్న తొలి వ్యాక్సిన్‌‌‌‌ ‘ఎంపాక్స్’ మాత్రమే. దీనికి మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారని స్థానిక మీడియా తెలిపింది. ట్రయల్స్ విజయవంతం అయితే చైనాలో త్వరలోనే ప్రజలకు వ్యాక్సిన్‌‌‌‌ అందుబాటులోకి రానుంది. అంతేకాక  చైనా పొరుగు దేశాలకు కూడా ఈ వ్యాక్సిన్ అందనుంది.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..  జనవరి 2022 నుంచి  ఆగస్టు 2024 మధ్య 120 కంటే ఎక్కువ దేశాల్లో  లక్ష కేసులు నమోదయ్యాయని తెలిపింది. అంతేకాక 220 మరణాలు సంభవించాయి. ఈ ఏడాది ఆగష్టు 14న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో  తో పాటు పొరుగు దేశాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుత  ఈ వ్యాధికి సంబంధించి నివారణ, నియంత్రణ చర్యలను వివిధ దేశాలు తీసుకుంటున్నాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో ఎంఫాక్స్ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇలా మంకీపాక్స్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా ఎంపాక్స్ పేరుతో వ్యాక్సిన్ ను రెడీ చేసింది. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. మంకీపాక్స్ కు సంబంధించిన వచ్చిన తాజా న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.