iDreamPost
android-app
ios-app

చైనాలో కార్లు ఉబ్బుతున్నాయి! తయారీలో లోపం కాదు! కారణం సైన్స్!

  • Published Aug 14, 2024 | 1:23 PM Updated Updated Aug 14, 2024 | 1:23 PM

చైనాలో గత కొన్ని రోజులుగా హీట్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అక్కడ చాలా కార్లు ముందు భాగాలు ఒక బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి కారణం చైనా కారుల తయారీలో లోపమని అంతా అనుకుంటున్నారు. కానీ, నిజానికి కార్లు ఇలా ఉబ్బిపోవడం వెనుక సైన్స్ కూడా కారణమని చాలామందికి తెలియదు.

చైనాలో గత కొన్ని రోజులుగా హీట్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అక్కడ చాలా కార్లు ముందు భాగాలు ఒక బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి కారణం చైనా కారుల తయారీలో లోపమని అంతా అనుకుంటున్నారు. కానీ, నిజానికి కార్లు ఇలా ఉబ్బిపోవడం వెనుక సైన్స్ కూడా కారణమని చాలామందికి తెలియదు.

  • Published Aug 14, 2024 | 1:23 PMUpdated Aug 14, 2024 | 1:23 PM
చైనాలో కార్లు ఉబ్బుతున్నాయి! తయారీలో లోపం కాదు! కారణం సైన్స్!

ప్రస్తుతం వర్ష కాలం కావడంతో.. దేశవ్యాప్తంగా ఎరతేరిపిలేని వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లోని ప్రజలు అతలకుతలం అవుతున్నారు. కానీ, చైనాలోని మాత్రం గత కొన్ని రోజులుగా భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు 80 రోజులుగా చైనాలోని హీట్ వేవ్ కొనసాగతుంది. దీని వల్ల ఎన్నడూ లేని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో 260 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది.ఇలా చైనాలో విపరీతమైన ఎండలు మండిపడంటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ అక్కడ ఓ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చైనాలో కార్లు ముందు భాగాలు బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారుతున్నాయి. అయితే ఇలా జరగడం వెనుక సైంటిఫిక్ గా ఓ కారణం ఉందట మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

చైనాలో గత కొన్ని రోజులుగా హీట్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అక్కడ చాలా కార్లు ముందు భాగాలు ఒక బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్స్ ఫన్నిగా కారుకు ప్రెగ్నెన్సీ వచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం చైనా కార్లు తయారిలో ఏదో లోపం ఉందంటున్నారు. అయితే నిజానికి చైనాలో హీట్ వేవ్ కారణంగా.. కారుపై ఉన్న ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదట. కానీ, ఈ రంగు ఉన్న పొర అవసరమైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే.. కార్లపై వేడి పేరిగిపోయి ఇలా ఉబ్బిపోతుందట.

ఈ క్రమంలోనే.. కారు బానెట్, సైడ్‌ లు, వెనుక ట్రంక్‌పై బెలూన్ లాంటి ఆకారంలా కనపడుతోంది. ఇక దీనిని చూసిన అక్కడ ప్రజలు కార్లకు ఏమైందోనని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే నిజానికి ఇంతకు ముందేప్పుడు ఇలా జరగలేదని సమాచారం. ప్రస్తుతం ఇలా ఉబ్బిపోయిన చైనా కార్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీనిని చూసిన నెటిజన్స్ ఒక్క చైనా కార్లు మాత్రమే కాదనీ, జర్మన్ కార్లు కూడా ఇలానే ప్రెగ్నెంట్ అయిపోయాయని అంటున్నారు. అంతేకాకుండా.. చైనా మార్కెట్లో నకిలీ కార్ ప్రొటెక్షన్ పెయింట్ గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ, నిజానికి కార్లలో లోపం కాదని, దీనికి వెనుక ఇంత సైన్స్ ఉందని చాలామందికి అంతగా అవగాహన లేదు. మరీ, చైనాలో ఇలా హీట్ వేవ్ కారణంగా కార్లు ఉబ్బిపోవడం వెనుక ఉన్న సైన్స్ కూడా కారణం ఉందనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.