కరోనా ఎఫెక్ట్ – లాక్ డౌన్ దిశగా తెలుగు రాష్ట్రాలు?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారతదేశాన్ని కూడా మరింత భయపెడుతుంది. ఇప్పటికే రోజు రోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం, మరణాలు సైతం పెరగడంతో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది . ఇప్పటికే జనతా కర్ఫ్యూ దేశ వ్యాప్తంగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న 75 జిల్లాల్లో లాక్ డౌన్ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దీంతో ఇప్పటికే దేశం లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా ప్రకటనలు చేశాయి.

ఈ నేపద్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అత్యవసరంగా ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు , అధికారులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రులు ఇద్దరూ సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతునట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశాల్లో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కీలక ప్రకటన చేయబోతునట్టు సమాచారం . కరోనా కట్టడికి తీసుకునే చర్యల్లో బాగంగా రాబోయే మరి కొన్ని రోజులు తెలుగురాష్ట్రాలో లాక్ డౌన్ ప్రకటించబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ లాక్ డౌన్ చేస్తే పరిస్థితి ఏంటి, ప్రజలకు నిత్యవసర వస్తువులు ఎలా అందించబోతున్నారు అనే విషయాలను కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా సమావేశంలో వెళ్ళడించే అవకాశం ఉన్నది.

Show comments