iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోలకు కొత్త తలనెప్పి

  • Published Mar 21, 2020 | 5:28 AM Updated Updated Mar 21, 2020 | 5:28 AM
స్టార్ హీరోలకు కొత్త తలనెప్పి

అసలే కరోనా దెబ్బకు షూటింగులు వాయిదా పడి సతమతమవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇప్పుడో కొత్త తలనెప్పి వచ్చి పడింది. అదే కాల్ షీట్స్. ఇలాంటి విపత్తు వస్తుందని ఎవరికీ ఊహామాత్రంగానైనా తెలియదు కాబట్టి ముందే ప్రిపేర్ అవ్వడం సాధ్యపడలేదు. ఇప్పుడు సద్దుమణగడానికి టైం పట్టేలా ఉంది. కాకపోతే వాళ్ళ సినిమాలు ఒప్పుకున్న ఇతర బాషల ఆర్టిస్టులతో సమస్యలు తప్పవనిపిస్తోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ తాలూకు షెడ్యూల్ కేరళలో శుభమా అని ప్లాన్ చేయగానే కోవిడ్ బాంబు పడింది.

అందులో తమిళ్ మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి చాలా కీలకమైన పాత్ర చేస్తున్నాడు. డేట్లు కూడా దానికి అనుగుణంగా ఏప్రిల్ లో ఇచ్చాడు. ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి ఆరవ సినిమాలను అడ్జస్ట్ చేసి మరీ దీనికి ఇవ్వడం అంత సులభం కాదు. ఒకవేళ అతను హెల్ప్ లెస్ అంటే వేరే ఆప్షన్ వెతుక్కోక తప్పదు. హీరోయిన్ రష్మిక మందన్నతో కూడా ఇదే చిక్కు వచ్చేలా ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ కోసం సరిగ్గా ఈ టైంలోనే డేట్లు ఇచ్చిన అలియా భట్ ఇప్పుడు ఇవి వృధా కావడంతో ఏం చేయాలో పాలుపోని అయోమయంలో పడిందట.

ఒకపక్క హిందీలో భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ బ్రహ్మాస్త్రకు కాల్ షీట్స్ ఇచ్చిన అలియా వాటిని కాదని ఆర్ఆర్ఆర్ కు ఇచ్చే ఛాన్స్ తక్కువే. అయితే ప్లానింగ్ లో తిరుగులేని వీరుడు రాజమౌళి దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం వెతక్కపోడు. ఇక హీరోయిన్ ఫిక్స్ కానీ ఆచార్యది ఇంకో ఇబ్బంది. మరీ బిజీగా లేని అమ్మడినే తీసుకోవాలి. కాజల్ అగర్వాల్ దాదాపు ఓకే అయినట్టు చెబుతున్నారు. సరే ఇదంతా అలా ఉంచితే తమ సినిమాల కోసం లాక్ చేసుకున్న టబు,నదియా లాంటి అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులతో ఇదే ప్రాబ్లెమ్ ఎదురు కావొచ్చు. మొత్తానికి వాయిదా పడ్డ సినిమాల రిలీజులు ఖరారు చేయడంతో పాటు ఇలాంటి కాల్ షీట్స్ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దాని మీద పరిశ్రమ పెద్దలు దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది.

jojobet girişmarsbahisJojobet GirişJojobet GirişCasibomtaraftarium24madridbet girişmadridbet girişmadridbetJojobet GirişkatlaJojobet Giriş