iDreamPost

Coolie OTT: రజినీకాంత్ కూలీ మూవీ రాబోయేది ఆ OTT లోకే..

  • Published May 24, 2024 | 12:42 PMUpdated May 24, 2024 | 12:42 PM

సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా వెంటనే దానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను చూశాము. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరొక సినిమా యాడ్ అయింది.

సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా వెంటనే దానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను చూశాము. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరొక సినిమా యాడ్ అయింది.

  • Published May 24, 2024 | 12:42 PMUpdated May 24, 2024 | 12:42 PM
Coolie OTT: రజినీకాంత్ కూలీ మూవీ రాబోయేది ఆ OTT లోకే..

చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన కొద్దీ రోజులకే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే, కనీసం నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీ లోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు మూవీ లవర్స్ ను ఆశ్చర్య పరచగా, ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి అప్పడే బజ్ నడుస్తుంది. తాజాగా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్స్ గురించి చూసేశాము. వాటితో పాటు రేపో మాపో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్స్ విషయాలు కూడా తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అసలు రిలీజ్ డేట్ కూడా ఇంకా క్లారిటీ రాని ఓ బడా హీరో సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్ గురించి బజ్ నడుస్తుంది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా “కూలీ”. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. సూపర్ స్టార్ రజిని కాంత్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీకి ఎన్నో మంచి మంచి హిట్స్ ను అందించారు సూపర్ స్టార్ రజిని కాంత్. ఇక ఇప్పుడు కూలీ సినిమాను సూపర్ స్టార్ కెరీర్ లో 171 వ చిత్రంగా నిలిచిపోనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తయితే కనుక.. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీగా అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కు.. బాగానే స్పందన లభించింది. దీనితో ఈ సినిమాపై అందరికి అంచనాలు బాగానే పెరిగిపోయాయి. మరి ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అప్పుడప్పుడు టాక్ నడుస్తూనే ఉంది. అంతే కాకుండా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి