Idream media
Idream media
నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్, తెలంగాణకు పట్టిక సదృష్యమైన అవగాహణ ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కేటాయించిన నీళ్లకు తగినట్లుగానే ప్రాజెక్టులు కట్టామని స్పష్టం చేశారు. అందరూ అలాగే చేసుకోవాలని సూచించారు. పోతిరెడ్డిపాడుపై అరవీరభయంకరంగా పోట్లాడింది తానేనని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు– దిండి ఎత్తిపోతలపై అపెక్స్ కౌన్సిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కౌన్సిల్ ముందు ఒప్పుకుని వెళ్లారని కేసీఆర్ చెప్పారు. ఆ మినిట్స్ కూడా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.
రాయలసీమకు గోదావరి నీళ్లను తీసుకెళ్లమని చెప్పామని, ఇందులో మాకు ఏమీ అభ్యంతరంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పిలిచి, భోజనం పెట్టి బేషిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పి వెయ్యి టీఎంసీలు ఉన్నాయి.. మీరు వాడుకోండి.. మేము వాడుకుంటాం అని చెప్పామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు తొడగొట్టి సుప్రింకు వెళ్లిన ఏం చేశారని ప్రశ్నించారు. బాబ్లిపై కొట్లాడి ఏం సాధించారని ప్రశ్నించారు.
మహారాష్ట్రకు సీఎం వద్దకు పలుమార్లు వెళ్లి మాట్లాడి నీళ్లు తెచ్చుకుని కాళేశ్వరం కట్టుకున్నామని కేసీఆర్ చెప్పారు. సీమకు నీళ్లు అవసరం అయితే గోదావరి నుంచి తీసుకెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తాము కూడా తీసుకెళతామని తెలిపారు. మొదటి నుంచి తాను ఇదే చెబుతున్నానని, తనకు రెండు నాల్కలు లేవన్నారు. మాకు అనుమానం కలిగించేలా, దెబ్బకొట్టేలా వ్యవహరిస్తే తప్పకుండా ప్రతిఘటిస్తామని కేసీఆర్ చెప్పారు.
ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, మంచిగా ఉన్నామని ఓ ప్రశ్నకు కేసీఆర్ సమాధానంగా చెప్పారు. మంచిగా ఉంటే మంచిగా ఉంటామని, కొట్లాటకు వస్తే కొట్లాడతామని స్పష్టం చేశారు.