మానవత్వం చాటుకున్న సిఎం జగన్.

ముఖ్యమంత్రి వై.యస్ జగన్ నిర్వహిస్తున్న మన పాలన మీ సూచన కార్యకరమంలో భాగంగా నేడు రాష్ట్రంలో విద్యా రంగంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్ధిని సిఎం జగన్ పాలన పై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తు ఒక్కసారిగా అందరిని భావోద్వేగానికి గురిచేసింది.

వివరాల్లోకి వెలితే సిఎం జగన్ పాలనలో విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణలు మీద ఒక విద్యార్ధిని తన అభిప్రాయలు చెబుతూ తన పేరు రమ్య అని కృష్ణ జిల్లా కానూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల లో తాను 10వ తరగతి చదువుతున్నానని, తాను కూడ అమ్మఒడి పధకం లబ్దిదారులం అని, పేదవారమైన తమకు ఈ పధకం ద్వారా అందుతున్న డబ్బు ఎంతగానో ఉపయోగపడిందని, ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన భరోసాతో తాను బాగా చదివి ఉన్నతస్థాయికి వెళ్లగలనన్న నమ్మకం ఏర్పడిందని మీరు మాకు ఒక మామగా అండగా నిలబడ్డారు అని దీనికి మేము మీకు ఎంతగానో రుణపడి ఉంటాము అని చెప్పుకొచ్చింది.

అలాగే తాను చిన్నప్పుడే తండ్రిని కోల్పోయానని , ఇప్పుడు తన తల్లికు కూడా ఆరోగ్యం బాగోలేక మంచాన పడిందని, తను కూడా ఎప్పుడు చనిపోతుందో తెలియని పరిస్థితి అని ముఖ్యమంత్రి జగన్ గారి ముందు కన్నీటి పర్యంతం అవ్వగా , స్పందించిన జగన్ వెంటనే ఆ విద్యార్ధిని దగ్గర పూర్తి వివరాలు సేకరించి వెంటనే ఏమి చేయగలమో అది చేసి అండగా ఉండాలని అక్కడ ఉన్న అధికారులని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విద్యార్ధిని రమ్య ఇంటికి చేరుకుని తన తల్లి గారి ఆరోగ్య పరిస్థితి పై ఆరాతీశారు. వెంటనే ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రికి తరలించబోతునట్టు తెలియజేసారు. గతంలో కూడా వైజాగ్ లో ఇదే మాదిరి రోడ్డు మీద తన మిత్రుని ఆరోగ్యం విషమంగా ఉందని ఆదుకోవాలని కొందరు విద్యార్ధులు ప్లకార్డులతో ప్రదర్శన చేయగా వాటిని గమనిoచిన ముఖ్యమంత్రి జగన్ అప్పటికప్పుడు కారు ఆపి వారిని నేరుగా కలుసుకుని కావల్సిన సాయం అందించారు. ఒక ముఖ్యమంత్రి ఈ విదంగా ప్రజల సమస్యల పై స్పందించి వెంటనే అధికారులని పంపి భాదితులని ఆదుకుని తనలో ఉన్న మానవత్వాన్ని మరో సారి చాటుకున్నారు జగన్.

Show comments