iDreamPost
iDreamPost
విశాఖ లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ ఘటనతో కంపెనీ ప్రతినిధుల పై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఇప్పటికే 9మంది చనిపోగా అనేక మందిని అస్వస్థతతో హాస్పిటల్ పాలయ్యారు. దీంతో ఉదయాన్నే హుటాహుటిన వైజాగ్ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ భాదితులు ఉన్న ఆసుపత్రులకు వెళ్ళి వారిని పరామర్శించారు. ఆ తరువాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఘటనకు సంభందించిన ప్రాధమిక వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సంఘటనపై సమావేశంలో పాలుగొన్న అధికారులు మాట్లాడుతు ఈ ఘటన ఎల్జీ పాలిమర్స్ లో సెఫ్టీ సిస్టం ఫెయిల్యూర్ వలన తెల్లవారుజామున ఉదయం 3.45కి జరిందని , ఈ కంపెనీలో స్టైరిన్ కెమికల్ నింపిన రెండు ట్యాకులు ఉన్నాయని అందులో ఒకటి 2500 కె.యల్ మరొకటి 3500 కె.యల్ అని, అయితే ఈ లీకేజ్ మొత్తం 2500 కే.యల్ ట్యాంక్ నుండే మొదలైనట్టు చెప్పుకొచ్చారు, ప్రస్తుతానికి ఆ ట్యాంకులో 1800 కె.యల్ మాత్రమే ఉందని 700 కె.యల్ ఖాళీగా ఉందని ఈ కెమికల్ లిక్విడ్ ఫాంలో ఉంటుందని దీనిని 20% సెల్సియస్ కన్న తక్కువలో ఉంచితేనే లిక్విడ్ ఫాంలో సేఫ్ గా ఉంటుందని. అయితే కొంత సాంకేతిక సమస్య ఏర్పడటం వలన ఈ రిఫ్రిజిరేటర్ పని చేయక పోవడంతో ఒక్కసారిగా వేడి ఉత్పన్నం అయ్యేసరికి లిక్విడ్ ఫాం లో ఉన్న ఈ కెమికల్, గ్యాస్ గా రూపాంతరం చెంది, అది లీక్ అయి వెంకటాపురం, పద్మనాభపురం చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేసిందని వివరించారు .
అయితే అధికారులతో సమావేశంలో పాల్గున్న ముఖ్యమంత్రి జగన్ ఘటనకు సంభందించి అన్ని వివరాలను అధికారులను అడిగి మరీ తెలుస్కోవడం కనిపించింది. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటూ , గ్యాస్ ప్రభావితం తవరకు ఉంటుంది. అది పూర్తిగా త్వలిగిపోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అని అడిగి అధికారుల నుండి పూర్తిగా వివరాలు రాబట్టారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు, వెంటిలేటర్ మీద ఉన్నవారికి 10 లక్షలు, 5 బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 10వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వబోతునట్టు ప్రకటించారు.
అయితే విశాఖ పట్నం నుండి తిరిగి తాడేపల్లికి బయలు దేరిన సియం జగన్ విశాఖ విమానాశ్రయం లో దక్షిణ కొరియా కు చెందిన ఎల్.జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులను పిలిపించి జరిగిన ఘటనపై వారిని విచారించి వారి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది , ప్రాణ ,ఆస్తి నష్టాలకి సంభందిoచి పూర్తి భాద్యత కంపెనీయే భరించాలని, గతంలో కూడా సదరు కంపెనీ పైన పొల్యుషన్ బోర్డుకి కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టు, జన బాహుళ్యం మద్యన ఇలాంటి కంపెనీ ఉండటాన్ని అనేక మంది ఆ ప్రాంత వాసులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని కావున నేడు జరిగిన ఈ సంఘటనకు సంభందించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడానికి ఒక హైపర్ కమిటిని నియమించామని , ఆ కమిటి నివేదిక రాగానే దాని ఆదారంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని ముఖ్యమంత్రి జగన్ కంపెనీ ప్రతినిదులకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.