iDreamPost
android-app
ios-app

జగన్ ముందు తేలిపోతున్న చంద్రబాబు.

  • Published May 17, 2020 | 3:41 PM Updated Updated May 17, 2020 | 3:41 PM
జగన్ ముందు తేలిపోతున్న చంద్రబాబు.

రాజకీయాల్లో తాను ఒక దార్శనీకుడనని, అనుభవశాలి అని, మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేయించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన చంద్రబాబుకు ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలిస్తునట్టు కనిపించడంలేదు. మీడియా, దాని తీరు , వ్యవహారాల పట్ల ప్రజల్లో ఒక స్పష్టమైన అవగాహన రావడంతో ఆయనకు గడ్డు కాలం ఏర్పడిందనే చెప్పాలి. దీంతో ఆయన ఎన్నో ఎళ్ళుగా తగిలించుకున్న బిరుదులు ప్రజల్లో పలచన బడుతూ వస్తున్నాయి. ఆయనలోని రాజకీయ పటుత్వం తాలూకూ గుట్టు ప్రజలముందు బహిర్గతం అవుతుంది. దీనికి తోడు ముఖ్యంగా సీఎం జగన్ వేగాన్ని ఆయన అందుకోలేక పోతున్నారు.

అధికారంలో ఉన్న పార్టికి పాలనా పరంగా అనేక సమస్యలు ఉండటం కారణంగా కొన్ని ప్రజా సమస్యలు వారి దృష్టికి చేరవు. ఇటువంటి సమయంలోనే ప్రతిపక్ష పార్టి ఆ సమస్యను తన భుజాన వేసుకుని అధికార పార్టి పై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం ఆ అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వడం లేదు. ఏ ప్రజా సమస్య అయినా ముఖ్యమంత్రి జగన్ తన పటిష్టమైన యంత్రాంగంతో తన దృష్టికి వచ్చిన గంటల వ్యవదిలోనే పరిష్కారం చేస్తున్నారు. కోన్ని సమస్యలు ప్రతిపక్షానికి తెలిసే లోపే పరిష్కరించబడుతున్నాయి అంటే అతిశయొక్తి కాదు. ఇందుకు జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి అనడంలో సందేహం లేదు.

ఇలా ప్రజా సమస్యల పట్ల వేగంగా దూసుకువెల్తున్న ముఖ్యమంత్రి జగన్ వేగాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందుకోలేక పొతున్నారు. సమస్యను తాను అందిపుచ్చుకుందాం అని చూసే లోపే జగన్ ఆ సమస్యని పరిష్కరించేసరికి ఏమి చేయాలో పాలుపోక ప్రజల ముందు కనపడే అవకాశం కల్పించుకునేందుకు సరికొత్త దారిని ఎంచుకున్నారు బాబు . జగన్ పరిష్కరించబడ్డ సమస్య అయినా సరే, తన దృష్టిలో ఉంది అని తెలియజేయడానికి ఆ పరిష్కరించబడ్డ సమస్య గురించి మాట్లాడి ప్రభుత్వం పరిష్కరించాలి అని చెప్పి పేలవంగా వెళ్ళిపోతున్నారు.

గతంలో కోవిడ్ ను ఎదుర్కోవడానికి జగన్ ప్రధాన మంత్రికి ఇచ్చిన జోన్ ల సలహా కేంద్రం పరిశీలిస్తుంది అని తెలిసే సరికి , నేను ఈ జోన్ ల మీద ప్రధానితో మాట్లాడా అని చెప్పుకొచ్చారు.విశాఖ ప్రమాధంలో కూడా నష్టపరిహారం తెలుగుదేశం చెప్పిన దానికన్న ఎక్కువ ప్రకటించి అంతే వేగంగా చెక్కులు వారికి అందించడంతో చంద్రబాబుకు నోట మాట రాలేదు. గుజరాత్ లో చిక్కుకున్న జాలర్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గా జగన్ అన్ని చర్యలు తీసుకున్నాక ఆ సమస్య పరిష్కరించాలని కోరారు. ఇక తాజాగా వలస కూలీల విషయంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ వారికి దేశంలో ఎక్కడాలేని విధంగా వసతి భోజన సదుపాయలతో పాటు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేసి అన్ని చర్యలు చేపట్టగా , నేడు ఆయన మాట్లాడుతూ వలస కూలీలకు భోజనం, వసతి, రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇలా ఒక సమస్యను తాను అందుకునే లోపే జగన్ పరిష్కార దిశగా అడుగులు వేయడంతో చంద్రబాబు జగన్ వేగం ముందు తేలిపోతున్నారు. ప్రజల్లో ఎలాగైనా తన పేరు వినపడాలి అనే ఆత్రుతతో పరిష్కరించబడ్డ సమస్యలని తిరిగి ప్రస్థావించడం లేదా మడ అడువులు లాంటి అసత్య ప్రచారాలు చేయడంతో నవ్వులపాలవుతున్నారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి ఇంత పేలవంగా వెనకపడి పోవడానికి కారణం జగన్ అందిస్తున్న పాలనతో పాటు ప్రజా సమస్యల పట్ల ఆయన వేగంగా స్పందిస్తున్న తీరు కూడా అని చెప్పవచ్చు.