అన్నదమ్ములు…చెరో తీరు !!

పోలీసులకు చిరు సెల్యూట్ – సర్కారుపై పవన్ గుస్సా

వారిద్దరూ అన్నదమ్ములు ..ఇద్దరూ రాజకీయ నాయకులు…అయితే ప్రస్తుత కోవిడ్ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఒకొక్కరు ఒక్కోలా స్పందించారు. వారిలో అన్న ప్రభుత్వాన్ని కొనియాడితే తమ్ముడు మాత్రం ఆ ఆపత్కాలంలో రాజకీయ కోణాన్ని వెతికారు..ఆ బ్రదర్స్ ఇంకెవరో కాదు.. మెగా బ్రదర్స్ చిరంజీవి,పవన్ కళ్యాణ్. ..కరోనా నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా పేదలు నానా అవస్థలు పడుతున్నారు.

అయినా సరే ప్రజల ప్రాణాలు పోతున్న తరుణంలో లాక్ డవున్ ను అమలు చేస్తూనే వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇంటింటికీ వెయ్యి రూపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.
అయితే దీన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విపత్కర పరిస్థితిలో రాజకీయాలు వద్దంటూనే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై ఎన్నికల కమిషనర్ కు ఫీర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో పంపిణీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ కష్టకాలంలో ప్రజలకు చేస్తున్న సాయాన్ని కూడా ఆపేందుకు ఆయన వెనుకాడలేదు. రాజాకీయాలు చేయొద్దు అంటూనే ఈసీ కి ఫిర్యాదు చేయాలని సూచించడం గమనార్హం.

ఇదిలా ఉండగా పవన్ అన్నయ్య చిరంజీవి మాత్రం పోలీసులకు సాల్యూట్ చేశారు. తాను ఒక పోలీసు బిడ్డగా సాల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. రాత్రి,పగలు అన్న తేడా లేకుండా కరోనా నేపద్యంలో లాక్ డౌన్ ను అమలు చేయడానికి ఎంతో కష్టపడి దేశానికి పోలీసులు సేవలు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు.ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. పోలీసుల పనితీరు వల్ల లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది.అలా జరగడం వల్లే కరోనా వ్యాప్తి చాలా వరకూ అదుపులోకి వచ్చిందని ఆయన అన్నారు. దీనికి తెలంగాణా డిజిపి మహేందర్రెడ్డి స్పందిస్తూ తమకు చిరంజీవి ఒక స్ఫూర్తి అని రిప్లై ఇచ్చారు. చిరు ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అభిమానులు కూడా పోలీసులకు సహకరిస్తూ లాక్ డౌన్లో ఉంటున్నారని అన్నారు. ఒకే సందర్భంలో అన్న మంచిని చూస్తే, తమ్ముడు మాత్రం చెడును వెతుక్కోవడం గమనార్హం.

Show comments