గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్యమైన హైలైట్స్

ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మలయాళం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో సత్యదేవ్, నయనతార, మురళీశర్మ, సముతిరఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికిది మక్కికి మక్కి సీన్ టు సీన్ కాపీగా తీస్తారేమోననే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. లూసిఫర్ నిడివి మూడు గంటలకు దగ్గరగా ఉంటుంది. అది కూడా కేవలం ఒక ఐటెం సాంగ్ తో పాటు రెండు బ్యాక్ గ్రౌండ్ థీమ్ మ్యూజిక్స్ తో కలిపి. మోహన్ లాల్ ఎంట్రీనే సరిగ్గా అరగంట తర్వాత వస్తుంది. అప్పటిదాకా చిరు కోసం వెయిట్ చేయడం కష్టం.

అంతేకాదు సెకండ్ హాఫ్ లో చాలా కీలకమైన తమ్ముడి క్యారెక్టర్ ని అక్కడ టోవినో థామస్ పోషించాడు. దానికి చాలా పేరొచ్చింది. అతను వచ్చిన సుమారు అరగంట పాటు అసలు కథానాయకుడి జాడే ఉండదు. ఇక్కడ అలా చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరనే ఉద్దేశంతో పాటు అంత ముఖ్యమైన పాత్రను పోషించే యూత్ హీరోని సెట్ చేసుకోవడం కష్టం కాబట్టి చాలా నేర్పుగా దాన్ని పూర్తిగా తీసేసి వేరే ట్రాక్ ని పెట్టారని తెలిసింది. దానికి బదులుగా మరికొన్ని రాజకీయాలకు సంబంధించిన ట్విస్టులతో పాటు చిరంజీవి మరింత ఎలివేట్ అయ్యేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు టాక్. దీనికోసమే గాడ్ ఫాదర్ టీమ్ తో పాటు సీనియర్ రచయిత సత్యానంద్ చాలా చర్చలే చేశారట.

ఇక తెలుగులో లెన్త్ రెండున్నర గంటలు మించకపోవచ్చని మరో న్యూస్. అంటే క్రిస్పీ అండ్ స్వీట్ సూత్రాన్ని పాటించారన్న మాట. సల్మాన్ ఖాన్ కనిపించేది పావు గంటే అయినప్పటికి తార్ మార్ తక్కర్ మార్ పాటతో పాటు కొన్ని సరదా సన్నివేశాలు ఇద్దరు మెగాస్టార్ల మధ్య ఉంటాయని తెలిసింది. తమన్ దీనికి ఎలాంటి కమర్షియల్ ట్యూన్స్ ఇవ్వలేదు. కథలో అసలు హీరోయినే లేదు కాబట్టి ఆ అవకాశం దక్కలేదు. అఖండను కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన తమన్ ఇప్పుడు చిరుని ఎలా డీల్ చేశాడో చూడాలి. అనంతపూర్ లో జరిగే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేయబోయే ట్రైలర్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు

Show comments