వీడియో: CM కాన్వాయ్ కోసం.. పసిబిడ్డతో గంటసేపు ఆగిన అంబులెన్స్!

వీడియో: CM కాన్వాయ్ కోసం.. పసిబిడ్డతో గంటసేపు ఆగిన అంబులెన్స్!

దేశాధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలు తరచూ వివిధ పర్యటనలు చేస్తుంటారు. వీఐపీలు పర్యటించే సమయంలో వారికి భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా వారు ప్రయాణించే మార్గాలను ఇతర వాహనాలు నిలిపివేయడం, లేదా పాక్షికంగా రద్దు చేయడం చేస్తుంటారు. అయితే వీఐపీల సమయం, భద్రతను పరిగణలోకి తీసుకుని ఒక్కొక్కసారి అధికారులు వ్యహరించే తీరు సామాన్యుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా అనారోగ్యంతో ఉన్న చట్టిబిడ్డతో వెళ్తున్న అంబులెన్స ను సీఎం కాన్వాయ్ కోసం గంటసేపు ఆపారు. అంబులెన్స్ ను వదలండీ అంటూ  అంటూ మహిళ ఆందోళన చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నలంద జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇథనాల్ పరిశ్రమను ప్రారంభించారు.  అనంతరం తిరిగికి పట్నాకు బయలుదేరారు. ఈ క్రమంలోనే నలంద నుంచి పట్నా వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపి వేశారు. ఈ క్రమంలోనే ఫతుహా వద్ద ఓ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న చంటిబిడ్డను అంబులెన్స్ లో పాట్నాకు తీసుకెళ్తున్నారు. ఆ అంబులెన్స్ ట్రాఫిక్ లో గంటసేపు  చిక్కుపోయింది.  ఈ క్రమంలోనే పట్నాలోని ఆస్పత్రికి త్వరగా వెళ్లాలంటూ  ఆ పాప తల్లి.. పోలీసులను  అభ్యర్థించింది.  ఆమె చాలా సమయం పాటు వేడుకున్న అంబులెన్స్ ను వదిలేందుకు పోలీసులు ఒప్పుకోలేదు.

అంబులెన్స్ లో చంటిబిడ్డతో ఆందోళన చెందుతున్న మహిళ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం కాన్వాయ్ వస్తుందని పట్నా పోలీసులు అన్ని వాహనాలు ఆపేయండం ఏంటని, కొన్ని అత్యవసర వాహనాలకు మినహాయింపు ఉండాలి కదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సామాన్యుల ప్రాణాలు.. ప్రాణాలు కాదా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల క్రితం కూడా బిహార్ లో ఇదే తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పుడు  అంబులెన్సును ఆపిన పోలీసులును గుర్తించినప్పటికీ .. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరీ.. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపైన చర్యలు ఉంటాయా లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరి..  సీఎం కాన్వాయ్ కోసం ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని  ఇబ్బంది పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments