iDreamPost

వందేభారత్‌ రైల్లో 14 నిమిషాల అద్భుతం! నేడే ఆరంభం..

వందేభారత్‌ రైల్లో 14 నిమిషాల అద్భుతం! నేడే ఆరంభం..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్. తక్కువ సమయంలో దూర ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ రైలును కేంద్రం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తున్నాయి. అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో, అద్భుతమైన సదుపాయాలతో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తాజాగా వందేభారత్‌ విషయంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. వందేభారత్ రైళ్లను కేవలం 14 నిమిషాల్లోనే శుభ్రం చేసి, తదుపరి ప్రయాణానికి సిద్ధం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి “14 నిమిషాల అద్భుతం” అనే పేరుతో  అమలు చేయనున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్లను దేశవ్యాప్తంగా మెల్ల మెల్లగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే కొత్తగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం దేశంలో వందే భారత్‌ రైళ్ల సంఖ్య 34కి చేరింది. అలాగే, కొత్త వందే భారత్ రైలులో ఒకటి రైలు కాషాయ రంగులో ఉంది. అది కాసర్ రోడ్డ నుంచి తిరువనంతపురం మధ్య నడుస్తోంది. మిగిలిన రైలు నీలం రంగులో ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో మరో 9 కాషాయ రంగు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.

ఇక వందే భారత్ రైళ్ల విషయంలో ఓ కీలక మార్పు చోటుచేసుకుంది. అది కూడా ‘14 నిమిషాల అద్భుతం’ పేరుతో క్లినింగ్ కార్యక్రమం నిర్వహించనుంది. ఆదివారం నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోన్న 29 వందేభారత్‌ రైళ్లలో ‘14 నిమిషాల అద్భుతం’ని అమలు చేయనుంది. జపాన్‌లోని టోక్యో, ఒసాకా వంటి స్టేషన్లలో బులెట్‌ రైళ్లను కేవలం ఏడు నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంటారు. వాటిని ఆధారంగా తీసుకుని వందేభారత్ రైళ్ల శుభ్రత సమయ తగ్గించుకోవాలని భారత రైల్వేశాఖ నిర్ణయించుకుంది. ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వచ్ఛత హే సేవ పేరుతో దీనిని లాంఛనంగా ప్రారంభిస్తారు.

వందే భారత్ రైళ్లలో శుభ్రపరిచే ప్రక్రియను క్రమబద్ధీకరించి.. వాటిని మరింత సమర్థవంతంగా తక్కువ సమయంలోనే తదుపరి ప్రయాణానికి సిద్ధంగా ఉంచేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వందే భారత్ రైలును శుభ్రం చేయడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మరింత స్ట్రీమ్‌లైన్డ్ వర్క్‌ఫ్లో కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రైలు కేవలం 14 నిమిషాల్లో శుభ్రం చేసి సిద్ధం  ఉంచనున్నారు. దీని కోసం ఒక్కో కోచ్‌కు ముగ్గురు క్లీనింగ్ సిబ్బంది పని చేస్తారు. ఈ కొత్త ప్రయత్నం వందశాతం సమర్థవంతంగా ఉంటుందని అధికారి చెప్పారు. మరి..వందే భారత్ రైళ్లలో ఈ కీలకమైన మరో మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి