iDreamPost
android-app
ios-app

చిట్టి రూపాల్లో మెగా హీరోలు – Nostalgia

  • Published Feb 27, 2020 | 5:41 AM Updated Updated Feb 27, 2020 | 5:41 AM
  • Published Feb 27, 2020 | 5:41 AMUpdated Feb 27, 2020 | 5:41 AM
చిట్టి రూపాల్లో మెగా హీరోలు – Nostalgia

ఇప్పుడంటే మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్, సుప్రీమ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ లను చూస్తున్నాం కానీ వీళ్ళు బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఉండే వయసులో ఎలా ఉంటారన్న ఆసక్తి ఉండటం సహజం. అందుకే అభిమానుల కోసం సాయి ధరమ్ తేజ్ ఒక స్పెషల్ పిక్ పోస్ట్ చేశాడు. అందులో అసలు గుర్తుపట్టే ఛాన్స్ లేకుండా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు చిరంజీవి ఇద్దరమ్మాయిలు సుష్మిత, శ్రీజలు కూడా ఉన్నారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెనైలో ఉన్నప్పుడు ఏదో పూజ సందర్భంగా తీసిన పిక్ గా తేజు అందులో పేర్కొన్నాడు. సందర్భాన్ని స్పష్టం చేయలేదు కాని క్యుట్ ఎక్స్ ప్రెషన్స్ తో పిల్లల సందడి నెటిజెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. బహుశా ఈ బుడతల అల్లరి చూస్తున్న పెద్దోళ్ళు వీళ్లిద్దరూ భవిషత్తులో స్టార్ హీరోల రేంజ్ కి వెళ్తారని ఊహించారో లేదో మరి. ఒక పక్క రామ్ చరణ్ ఇప్పటికే టాప్ లీగ్ లో ఉండగా తేజు గత ఏడాది రెండు హిట్లతో(చిత్రలహరి-ప్రతిరోజు పండగే) మళ్ళీ మీడియం హీరోల మార్కెట్ లో తన స్థానాన్ని దక్కించుకున్నాడు .

చరణ్ ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది విడుదల కానుండగా తేజు సమ్మర్ లోనే సోలో బ్రతుకే సో బెటరూతో వస్తున్నాడు. వీటి తర్వాత ఈ ఇద్దరూ ఏ సినిమాలు చేస్తారనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. ఇదంతా బాగానే ఉంది కాని మెగా హీరోలు కలిసి అక్కినేని మనం స్టైల్ లో ఒక కాంబినేషన్ మూవీ చేయాలనీ అభిమానుల కోరిక. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలు ఒకే మూవీలో కనపడాలని ఎదురు చూస్తున్నారు. ఏ ఇద్దరు కలిసినా వాళ్ళకు హ్యాపీనే. సో అలాంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో, ఏ దర్శకుడు మెప్పిస్తాడో వేచి చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet