iDreamPost
android-app
ios-app

అన్ స్టాపబుల్ కోసం అనుకోని అతిథులు

  • Published Sep 28, 2022 | 7:50 PM Updated Updated Sep 28, 2022 | 7:50 PM
  • Published Sep 28, 2022 | 7:50 PMUpdated Sep 28, 2022 | 7:50 PM
అన్ స్టాపబుల్ కోసం అనుకోని అతిథులు

నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఫస్ట్ సిరీస్ కి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావడంతో ఇప్పుడు రెండో దానికి భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారు. ప్రత్యేకంగా ఒక లాంచ్ ఈవెంట్ ని ఖమ్మంలో లేదా విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. అనుమతులు, వాతావరణ పరిస్థితులను బట్టి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం తన 107 సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న బాలయ్య ఈ వారంలోనే తిరిగి రాబోతున్నారట. మళ్ళీ దాని ఫ్రెష్ షెడ్యూల్ మొదలయ్యేలోగా రెండు మూడు ఎపిసోడ్లకు తగ్గట్టు సెలబ్రిటీల వడబోత మొదలయిందని టీవీ వర్గాల సమాచారం.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి అనుకోని అతిథులు రాబోతున్నారట. ఫస్ట్ ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడుని పిలిచే ప్రతిపాదన ఉన్నట్టు వినికిడి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా అనూహ్యంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి కాంబినేషన్ అయితే జనంలో బాగా వెళ్తుందనే ఆలోచన నిర్వాహకుల్లో ఉన్నట్టు తెలిసింది. అయితే బాబు రెగ్యులర్ ఇంటర్వ్యూ కాని ఇలాంటి వాటికి ఓకే అంటారా అంటే చెప్పలేం కానీ స్వయానా బావమరిది అందులోనూ స్వంత పార్టీ ఎమ్మెల్యే అడిగితే నో అంటారా. ఈయన కన్నా ముందు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోని ట్రై చేశారు కానీ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో సాధ్యపడటం లేదట.

ఈ లిస్ట్ లో సమంతా కూడా రావొచ్చు. గతంలో ఆహా కోసం తను సామ్ జామ్ చేసిన సంగతి గుర్తే. ఇప్పుడు అదే ప్లాట్ ఫార్మ్ కాబట్టి కాదనపోవచ్చు. కాఫీ విత్ కరణ్ తర్వాత సామ్ ఎలాంటి ప్రోగ్రాంస్ లో పాల్గొనలేదు. ఏదో వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్తుందని, ఈ కారణంగానే విజయ్ దేవరకొండ ఖుషి పెండింగ్ లో ఉండిపోయిందని ఏవేవో ప్రచారాలు జరిగాయి కానీ దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. ఇక బాలయ్య తనకు బాగా ఆప్తుడైన మిత్రుడు చిరంజీవి ఒక్కడే అని ఆ మధ్య శాతకర్ణి ప్రమోషన్ టైంలో చెప్పడం వైరల్ అయ్యింది. సో అల్లు అరవింద్ ప్రోద్బలం ప్లస్ బాలయ్య స్నేహం కలిస్తే మెగాస్టార్ వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి చాలా క్రేజీ కలయికల ఉండటం మాత్రం కన్ఫర్మే.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş