Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు.. ప్రజల్లో జగన్ ప్రభుత్వానికి అంతకంతకూ ఆదరణ పెరుగుతుండడం… మరోవైపు టీడీపీ ప్రతిష్ఠ మసకబారుతుండడంతో ఆయనలో ఒణుకు కనిపిస్తోంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత అసహనం పెరుగుతున్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ప్రజల మధ్య సామరస్య భావానికి తూట్లు పొడిచేలా దేవాలయాలపై దాడుల అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించాలని ప్రయత్నించడంపై టీడీపీ లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల రచ్చ మొదలైంది. సాధారణంగా ఎక్కడైనా ప్రచారంలో ఇటువంటి మాటల యుద్ధాలు ఉంటాయి. నోటిఫికేషన్ విడుదలే వివాదాస్పదంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ప్రకటనలిస్తుంటే.. ఆయనకు అనుకూలంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.
ఇదిలా ఉండగా.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అన్ని నియోజకవర్గాల టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకూ సీఎంను ఇంట్లోనే ఉండాలని చెప్పడం విచిత్రంగా అనిపించింది. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు అన్నవాడు.. సీఎం జనాల్లోకి రావడం లేదని, జనాలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తుంటారు. ఇదేంటో ఏపీలో ప్రతిపక్ష నాయకుడే సీఎం ఇంట్లో ఉంటే మంచిదని చెప్పడం ఆశ్చర్యంగా మారింది. సీఎం అంటే భయమా..? లేదా తన లాగే ఆయన కూడా ఇంట్లోనే ఎక్కువగా ఉంటే బాబును ఎవరూ విమర్శించరని భావిస్తున్నారా..? చంద్రబాబుకే తెలియాలి.
కరోనా పేరు చెప్పి ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గత ఏడాదిలో ఎక్కువ రోజులు తెలంగాణలోనే గడిపారు. మార్చి 20 నుంచి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మార్చి 24న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత వరుసగా లాక్ డౌన్‌ను కొనసాగించడంతో చంద్రబాబు హైదరాబాద్‌లో ఇంటికే పరిమితం అయ్యారు. మేలో విశాఖలో మఎల్జీ పాలిమర్స్ ఘటన అనంతరం బాధితులను పరామర్శించ డానికి వెళ్తానని చంద్రబాబు నాయుడు తెలంగాణ డీజీపీకి దరఖాస్తు చేశారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానని కోరారు. కానీ ఆయన విశాఖ వెళ్లలేదు. విజయవాడలో జరిగిన మహానాడులో పాల్గొని మళ్లీ హైదరాబాద్ వచ్చేశారు. ఆ తర్వాత కూడా ఒకటి, రెండు సార్లు తప్పా చంద్రబాబు ఇంటికే పరిమితం అయ్యారనేది అందరికీ తెలిసిందే. ఆయన ఏపీకి వస్తున్నారనేది కూడా అప్పట్లో ఓ వార్తగా మారిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు సీఎంని కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ జరపడానికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు బాధ అని శ్నించారు. ‘పోలీసులను అడ్డుపెట్టుకొని గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ముఖ్యమం త్రి అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు అలా చేయలేడు కాబట్టే ఎన్నికలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాడు. ఎన్నికలు పె ట్టాలా.. వద్దా అనేది ఎన్నికల కమిషన్ అధికారం. ఈసీ అధికార పరిధిని ప్రశ్నించే అధికారం అధికారులకు, ఉద్యోగ సంఘా ల నేతలకు లేదు. పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎంకి ఏం సం బంధం? కోడ్ కారణంగా ఎన్నికలు పూర్తయ్యే వరకూ సీఎం ఇంటికే పరిమితం కావాలి… అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.