Idream media
Idream media
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధఃగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ విమాలా ఆదిత్య వెల్లడించారు.
గత నెల 16వ తేదీన మత్తు డాక్టర్ సుధాకర్ రోడ్డుపై కారు ఆపి స్థానికులను, ప్రజా ప్రతినిధులను దూషించారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుపై ప్రజా ప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను తూలనాడటంతోపాటు స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారని సీబీఐ తన కేసులో పేర్కొంది. 23 మంది సాక్షుల సమాచారంతోపాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను విశాఖ నాలుగో పట్టణ టౌన్ పోలీసులు సీబీఐకి అందించారు.
నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. పోలీసు సిబ్బందితోపాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్ జార్జ్ ఆస్పత్రి అధికారులను, వైద్యులను విచారించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి సుధాకర్‌పై 188, 375 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అంతకు ముందే సీబీఐ విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.