iDreamPost
android-app
ios-app

రజనీకాంత్ మరో పవన్ కళ్యాణా?

రజనీకాంత్ మరో పవన్ కళ్యాణా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వచ్చి, వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసాడు.అయితే ఆయన దూసుకెల్తాడ ?లేదా మన పవన్ కళ్యాణ్ లాగా అభిమానులతో చప్పట్లు కొట్టించుకుని తెరమరుగవుతారా అనేది కాలం నిర్ణయిస్తుంది.

గతంలో ఎంజీఆర్ కి పార్టీతోనూ, ప్రజలతోనూ అవినాభావ సంబంధం ఉంది. కరుణానిధితో విభేదించి అన్నాడీఎంకే పెట్టేనాటికి పార్టీ నిర్వహణపై, ఎన్నికల విధానంపై అనుభవముంది. అయన వారసత్వాన్ని తీసుకున్న జయలలితకి కూడా రాజకీయాలపై స్పష్టత ఉంది. వీళ్ళిద్దరూ ఉన్నట్టుండి రాజకీయాల్లోకి రాలేదు. తరువాత పార్టీ పెట్టిన విజయ్ కాంత్ రాజకీయ అనుభవం లేక దెబ్బతిన్నారు. పైగా విజయ్ కాంత్ గెలిచి ముఖ్యమంత్రి అవుతారనే అంచనాలు ఎవరికీ లేవు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వచ్చిన నేపథ్యం వేరు. కాంగ్రెస్ పై జనం విసిగిపోయిన రోజులవి. వాస్తవానికి ఏఎన్నార్,దాసరి కలిసి పార్టీ పెట్టి ఒక ప్రణాళికతో ఎన్నికలకు వెళ్లినా గెలిచేవాళ్లేమో.!(ఒకదశలో వీళ్ళిద్దరూ కలిసి పార్టీ పెడతారనే వార్తలొచ్చాయి). రాజకీయ శూన్యం ఉన్నందువల్ల తెలుగుదేశం నిలబడింది. చిరంజీవి వచ్చే సమయానికి టీడీపీ కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. అందుకే చిరంజీవి దెబ్బతిన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకొచ్చాడో,ఏం చేసాడో మనకి తెలియదు.

ఇప్పుడు తమిళ రాజకీయాల్లో జయలలిత తర్వాత అన్నాడీఎంకే కి ఆదరణ లేదు. కానీ డీఎంకే బలంగా ఉంది. ప్రతి గ్రామంలోనూ పార్టీ క్యాడర్ ఉంది. పైగా సినిమావాళ్లపై గతంలో ఉన్నంత గ్లామర్ లేదు. రజనీకాంత్ సినిమాల్లో డబ్బు సంపాదించడం తప్ప , ప్రజలకోసం ఏదో చేసిన దాఖలాలు లేవు. ఒక నటుడిగా తప్ప , నాయకుడిగా ప్రజలతో సంబంధాలు లేవు.

తాను ముఖ్యమంత్రిని కాదని అంటున్నాడు. ఇంకెవరినో సీఎం చేయడానికి జనం ఓట్లు వేస్తారా ?ఏడాదికాలంలో పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేయగలడా? విలక్షణమైన తమిళ ఓటర్లు రజనీ వైపు నిలబడతారా? అన్నీ ప్రశ్నలే.

రజనీది తమిళనాడు కాదని, కన్నడీయుడని గతంలో రజనీకాంత్ విమర్శలు చేశాడు. లోకల్ ఫీలింగ్ విపరీతంగా ఉండే తమిళ ఓటర్లపై ఈ ప్రభావం ఉండకూడదనే రజనీ తాను ముఖ్యమంత్రి కాదని అంటూ ఉండొచ్చు. సినిమా వాళ్ళ రాజకీయాలకి కాలం చెల్లిపోతున్న ఈ రోజుల్లో మరో కొత్త ముఖం వస్తుంది. ఫలితం తేలడానికి ఇంకా చాలా సమయం ఉంది.