iDreamPost
android-app
ios-app

వాషింగ్ మెషిన్లలో నోట్ల కట్టలు.. రూ. 1.30 కోట్లను పట్టుకున్న పోలీసులు

సార్వత్రిక ఎన్నికల ముందు సెమీ ఫైనల్స్ లా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో నవంబర్ లో ఎలక్షన్ జరగనున్నాయి. అక్కడ విచ్చలవిడిగా హవాలా మనీ చేతులు దాటిపోతుంది. అయితే తాజాగా ఏపీలో..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కిలోల కొద్దీ బంగారం, నగదు, వస్తువులు తరలి వెళుతున్నాయి. ఓటర్లను నగదు, వస్తు రూపేణా ఎర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఘా పెంచారు పోలీసులు. ఇప్పటికే పలు చోట్ల బంగారం, వెండి, భారీగా నోట్ల కట్టలు, మిక్సీ, కుక్కర్ వంటి వస్తువులు, చీరలు వంటివి పట్టుకున్నారు. అంతేనా తెలంగాణలోకి ఎంటరయ్యే అన్ని చెక్ పోస్టుల వద్ద పోలీసులు మోహరించి.. పెద్ద యెత్తున తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని ఆపి.. చెక్ చేస్తున్నారు. లెక్కల్లో లేని హవాలా మనీని పట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారీ మొత్తంలో నగదు పట్టుకున్నారు పోలీసులు.

హవాలా నగదును అక్రమంగా తరలించేందుకు కేటుగాళ్లు.. కొత్త కొత్త పంథాలను అనుసరిస్తున్నారు. ఇదిగో ఇలా. ఏకంగా వాషింగ్ మెషిన్లలో రూ. 1.30 కోట్లు లెక్కలు చూపని డబ్బును ఆటోలో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బు విశాఖ నుండి విజయవాడకు వెళుతుండగా.. మార్గమధ్యంలో ఎన్ఏడీ జంక్షన్ దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. నగదును సరైన ఆధారాలు లేకపోవడంతో హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు ఎవరిది అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఈ డబ్బు ప్రముఖ కంపెనీకి సంబంధించినది ప్రాథమిక విచారణలో నిర్ధారణైనట్లు తెలుస్తోంది.