iDreamPost
iDreamPost
రేపు మరో శుక్రవారం బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. కనీసం రెండు మూడు చెప్పుకోదగ్గ క్రేజీ సినిమాలు రాకుండా ఏ వారం గడవటం లేదు. ఈసారి దీపావళి పటాసులతో పాటు స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధ పడుతున్నారు. అందులో మొదటిది సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న. తెలుగు వెర్షన్ కు సుమారు 12 కోట్ల 50 లక్షల దాకా బిజినెస్ చేసినట్టు ట్రేడ్ టాక్. దీనికి అదనంగా మరో యాభై లక్షలు తెస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. సుమారు 650కి పైగా స్క్రీన్లతో పెద్దన్న రచ్చ చేయబోతున్నాడు. గతంలో పోలిస్తే రజిని రేంజ్ బిజినెస్ మార్కెట్ ఇది కాదు కానీ హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు ఖాయమే
ఇక మారుతీ బ్రాండ్ మీద ఎక్కువగా ప్రమోషన్ జరుపుకుంటున్న మంచి రోజులు వచ్చాయి సుమారు 10 కోట్ల టార్గెట్ తో బరిలో దిగుతోంది. అంటే నష్టం కలగకుండా గట్టెక్కాలంటే ఇంకో ఫిఫ్టీ ఎక్స్ ట్రా రాబట్టుకోవాలి. సంతోష్ శోభన్ మెహ్రీన్ లు నటించిన ఈ ఎంటర్ టైనర్ పబ్లిసిటీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇవాళ రాత్రే కొన్ని కేంద్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నారు. ఫైనల్ రిలీజ్ కు 270 దాకా స్క్రీన్లు అలాట్ అయినట్టుగా సమాచారం. ఇక పెద్దగా సౌండ్ లేని విశాల్ ఎనిమిని 5 కోట్ల రేషియో లో అమ్మారట. రిస్క్ తక్కువే అనిపిస్తున్నా పబ్లిక్ టాక్ ని బట్టే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సేఫ్ అవ్వడం ఆధారపడి ఉంటుంది.
పండగ వీకెండ్ ని ఈ మూడు సినిమాలు ఎలా వాడుకోబోతున్నాయో చూడాలి. హాలీవుడ్ మూవీ ఎటర్నల్స్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. మల్టీ ప్లెక్సుల్లో స్క్రీన్లు బాగానే ఇచ్చారు. సూర్యవంశీకి ఉన్న హైప్ తెలిసిందే. బాగుందనే మాట వస్తే చాలు నార్త్ లో ప్రభంజనం మాములుగా ఉండదు, కాకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో రజని మేనియాని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే తెలుగు సినిమాల బిజినెస్ రేపు ఒక్క రోజే ముప్పై కోట్ల దాకా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ క్రమంగా థియేటర్లకు వస్తున్న తరుణంలో టాక్ చాలా కీలకంగా మారుతోంది. పర్లేదు అన్నా చాలు పెట్టుబడులు సేఫ్ గా వచ్చేస్తున్నాయి
Also Read : Major Vs Laal Singh Chaddha : లాల్ సింగ్ చద్దాతో మేజర్ యుద్ధం