iDreamPost
android-app
ios-app

Prabhas: రాజా సాబ్.. వేరే లెవల్! హైప్ తో చంపేస్తున్న ప్రొడ్యూసర్!

  • Published Nov 11, 2024 | 3:17 PM Updated Updated Nov 11, 2024 | 3:17 PM

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

  • Published Nov 11, 2024 | 3:17 PMUpdated Nov 11, 2024 | 3:17 PM
Prabhas: రాజా సాబ్.. వేరే లెవల్! హైప్ తో చంపేస్తున్న ప్రొడ్యూసర్!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రయ్ రయ్ అంటూ దూసుకు వెళ్లిపోతున్నాడు. క్వాలిటీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అవుతున్నాడు. సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన ప్రభాస్ ఈసారి రాజా సాబ్ తో ఏకంగా బిర్యాని పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. మారుతి డైరెక్షన్ లో రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. తాజాగా ఈ సినిమాపై నిర్మాత విశ్వ ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ వింటే ఏంటి హైప్ తో చంపేస్తారా? అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? రాజా సాబ్ ఎందుకు లేట్ అవుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు ఈ సినిమాని కావాలనే మెల్లగా చేస్తున్నామని నిర్మాత విశ్వ ప్రసాద్‌ అన్నారు. రెండేళ్ల క్రితం సినిమా స్టార్ట్ అయినప్పటికీ కల్కి 2898 ఏడీ సినిమా విడుదల తర్వాతే షూటింగ్‌ స్పీడ్‌గా జరుగుతుందని అన్నారు. అంతకు ముందుతో పోల్చితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌కి ప్రభాస్‌ ఎక్కువ డేట్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. విశ్వ ప్రసాద్‌ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రాజాసాబ్‌ గురించి మాట్లాడుతూ… “ప్రస్తుతానికి రాజాసాబ్‌ గురించి ఎక్కువ వివరాలు చెప్పలేను, ఇది ఈ మధ్య మొదలైంది కాదు, కానీ కల్కి మూవీ విడుదల తర్వాతే పీక్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ మూవీ ఎవరూ ఊహించని స్కేల్‌లో ఉంటుంది. స్టోరీ, సెట్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు కామెడీ పీక్స్‌లో ఉంటుంది. ప్రభాస్‌ గారిని కచ్చితంగా డార్లింగ్‌లో చూసినట్లుగా చూస్తారు. ఆయన రోల్ లార్జర్‌ దెన్‌ లైఫ్ అన్నట్లు ఉంటుంది. అంతకు మించి హార్రర్ కూడా ఉంటుంది. ఇప్పటి దాకా వరల్డ్‌లో తీయనంత సైజ్‌లో రాజాసాబ్‌ సినిమాలో హార్రర్‌ ఉంటుంది… ఇది కచ్చితంగా ఒక చిన్న సినిమా అయితే కాదు” అని ఆయన అన్నారు.

ప్రొడ్యూసర్ కామెంట్స్ ని బట్టి చూస్తుంటే..ఈ సినిమా పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం అవుతుంది. ఆయన హైప్ తో డార్లింగ్ ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు. మొత్తానికి రాజా సాబ్ బిగ్గెస్ట్‌ హార్రర్‌ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. ఈ సినిమా డార్లింగ్‌ రేంజ్‌లో వేరే లెవెల్ లో ఉంటుందనేది ఫిక్స్. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా చాలు పాత రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం హార్రర్‌ కామెడీ సినిమాలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. అలాంటిది ప్రభాస్ ఇలాంటి సినిమాతో వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మన రాజా సాబ్ ప్రభాస్ ఈసారి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో మరి. ఇదీ సంగతి. ఇక రాజా సాబ్ పై మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet