iDreamPost
android-app
ios-app

నాగ్ కోసం బ్లాక్ బస్టర్ రీమేక్ ?

  • Published Jun 20, 2020 | 5:39 AM Updated Updated Jun 20, 2020 | 5:39 AM
  • Published Jun 20, 2020 | 5:39 AMUpdated Jun 20, 2020 | 5:39 AM
నాగ్ కోసం బ్లాక్ బస్టర్ రీమేక్ ?

లాక్ డౌన్ వల్ల వైల్డ్ డాగ్ షూటింగ్ కి బ్రేక్ వేసి రెస్ట్ లో ఉన్న కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఎవరూ ఖరారు చేయనప్పటికి త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఇది స్ట్రెయిట్ సబ్జెక్ట్ కాదని తాజా అప్డేట్. రెండేళ్ల క్రితం అజయ్ దేవగన్, ఇలియానా జంటగా హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘రైడ్’ ఆధారంగా ఇది రూపొందుతుందట. అందులో హీరో ఇన్కం టాక్స్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా నటించాడు. ఓ పెద్ద డాన్ ఇంటికి రైడ్ కు వెళ్లిన అతనికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఊహించని ప్రమాదాలు తలెత్తుతాయి. వీటిని తట్టుకుని నేరం ఎలా ఋజువు చేశాడనేదే అసలు పాయింట్.

టైట్ స్క్రీన్ ప్లేతో రూపొందిన రైడ్ బాలీవుడ్ లో 140 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా టేకింగ్ విమర్శకులను కూడా మెప్పించింది. సినిమా ఆద్యంతం ఒకే టోన్ లో ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది.అయితే ఇందులో సూర్య నటించిన గ్యాంగ్ తాలూకు ఛాయలు కొన్ని ఉంటాయి. వాటిని ఒరిజినల్ వర్షన్ లో చాలా తెలివిగా మేనేజ్ చేశారు. మరి తెలుగులో కూడా దాన్నే ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే నాగార్జునకు పర్ఫెక్ట్ గా సూటయ్యే రీమేక్ ఇది. గత కొన్నేళ్లుగా తన స్థాయి హిట్టు లేక ఎదురుచూస్తున్న నాగ్ కు ఇది మంచి ఛాయిసే. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఖరారుగా చెప్పలేం కానీ అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

వైల్డ్ డాగ్, ఇప్పుడీ సినిమాతో పాటు నాగ్ బంగార్రాజు కూడా చేయాల్సి ఉంది. కల్యాణ కృష్ణ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నప్పటికీ ఏవో కారణాల వల్ల అది వాయిదా పడుతూనే ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కానీ ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. వైల్డ్ డాగ్ ని మాత్రం ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అప్పటి పరిస్థితిని బట్టి తిరిగి రీ స్టార్ట్ చేయబోతున్నారు. మరోపక్క నాగ చైతన్య లవ్ స్టొరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా చివరి స్టేజిలో లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడటంతో అక్కినేని అభిమానుల ఎదురుచూపులు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. చూస్తుంటే ఈ ముగ్గురి సినిమాలు వచ్చే ఏడాది వచ్చినా ఆశ్చర్యం లేదు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş