కోవిడ్ మహమ్మారి మళ్ళీ విస్తరిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తున్నారు. ఇందుకు సంకేతంగా కేసులు సైతం పెరుగుతూ ఉండటం ప్రజల్లో భయాందోళనల్ని కలిగస్తోంది. తాజాగా దిల్లీలో ఒక్కసారిగా కేసులు పెరుగుతూ రావడం కలవరపెడుతోంది.
కేవలం 10 రోజుల సమయంలో దాదాపు 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం నిన్న ఒక్క రోజే 1,375 కొత్త కేసులు వచ్చాయి. ఈ పెరుగుదలతో తప్పనిసరిగా మాస్కులతో పాటు నిబంధననలు సైతం పాటించాలని కోరుతున్నారు వైద్య నిపుణులు. ఇప్పటివరకు మరణాలు రికార్డు కాకపోవడం కాస్త ఊరటినిస్తున్నా, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు.
వాస్తవానికి గత 10 రోజుల కాలంలో దాదాపు 450శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటివరకు మొత్తం 19,15,905 కేసులు నమోదవ్వగా, 26,223 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,643 యాక్టివ్ కేసులు ఉండగా, కేసుల పెరగుదలతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.