పెట్రో మంట: వైరల్ అవుతున్న బిగ్‌బీ ఓల్డ్ ట్వీట్

దేశంలో గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధర పెరిగుతున్నాయి. దీనిపై ఒకపక్క ప్రజలు, మరోపక్క ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో సంధిట్లో సడేమియా అన్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెంచేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువ ఉంది. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రతిపక్షాలు ఆందోళన చేద్దామన్నా లాక్ డౌన్ కారణంగా అందుకు అనుమతి లేదు.‌

ఇది పక్కన పెడితే ప్రస్తుతం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్ ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఆ ట్విట్ ఇప్పటిది కాదు. గతంలో 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో పెట్రోల్, డీజిల్ ధరలు‌ పెరగడంపై బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ట్విట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ట్విట్ పై ఆయనను ప్రశ్నిస్తున్నారు. నాడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు ప్రశ్నించిన నోళ్ళు… ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

2012లో బిగ్ బి అసలేం ట్విట్ చేశారు..?

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు‌పై 2012లో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన ఓ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. అప్ప‌ట్లో 8 రూపాయ‌లు పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌పై ర‌గులుతున్న జ‌నాలు త‌మ కార్ల‌ను ఎలా త‌గ‌ల‌పెట్టాల‌నుకుంటున్నారో చెబుతూ.. బిగ్‌బీ చేసిన విమ‌ర్శ‌లు ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు కూడా స‌రిగ్గా స‌రిపోయేలా ఉన్నాయి.

అమితాబ్ ట్వీట్ ప్రకారం.. పెట్రోల్ బంక్ వ‌ద్ద‌కు వెళ్లిన ఓ ముంబై వాసిని  ‘ఎంత పొయ్యమంటారు సార్’ అని అడుగుతాడు.. దానికి అత‌డు బ‌దులిస్తూ ‘2 లేదా 3 రూపాయ‌ల పెట్రోల్ కార్ మీద పోయ్యి బ్ర‌దర్.. త‌‌గ‌ల‌బెట్టేస్తాను’ అని అంటాడు.

ఈ ట్వీట్ చేసిన 8 సంవత్స‌రాల త‌ర్వాత తాజాగా నెటిజ‌న్లు ఈ పోస్టుపై స‌ర‌దా కామెంట్ చేస్తున్నారు. ‘బాగుంది సార్ జోక్ మ‌ళ్లీ ఒక‌సారి వేయండి ప్లీజ్‌, వాస్త‌వాల గురించి ధైర్యంగా మాట్లాడేందుకు ఇది స‌రైన స‌మ‌యం’ అంటూ పేర్కొంటున్నారు. 

కాగా గ‌త 19 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ లీట‌ర్ ధ‌ర 0.14 పైసలు పెరిగి 80.02కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన డీజిల్ ధ‌ర‌ల‌లో ఇదే అత్యాధికం. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 0.16 పైసలుపెరి‌గి 79.92 గా ఉంది. అంటే పెట్రోల్ ధ‌ర డీజిల్ కంటే ఇంకా ప‌ది పైస‌లు త‌క్కువ‌గానే ఉంది. 

అయితే 2012 సంవ‌త్స‌రంలో ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర‌లో మూడింట రెండు వంతులు లేదా అంత‌కంటే త‌క్కువ‌గా డీజిల్ ధ‌ర ఉండేది. 2002 నుంచి 2012 మధ్య పెట్రోల్ రిటైల్ ధరలు డీజిల్ రిటైల్ ధర కంటే ఎప్పుడూ పెర‌గ‌లేదు

అమితాబ్, అక్షయ్ కుమార్ ల నాటి ట్విట్లకు స్పందించిన మహారాష్ట్ర మంత్రి

మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్‌ ముంబైలో పెరుగుతున్న ఇంధన‌ ధరలపై సరదాగా స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను కార్లో ఇంధనం నింపాక బిల్లును తనిఖీ చేయడం లేదా అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజు రోజుకు పెంచుతుండటంతో బిగ్‌బీ గతంలో చేసిన ట్వీట్‌పై ఈ సందర్భంగా మంత్రి స్పందించారు.

2012లో పెట్రోల్‌ ధరలు మిన్నంటడంతో బిగ్‌బీ సరదాగా చేసిన ఓ ట్వీట్‌ను మంత్రి అవాద్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘పెట్రోల్‌ ధర లీటర్‌పై 7.5 రూపాయలు పెరగడంతో అసహనంతో ఉన్న ఓ ముంబైవాసి పెట్రోల్‌ పంప్‌‌కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది అతడిని ఎంత పెట్రోల్‌ కొట్టాలి సార్‌ అని అడగ్గా.. ఆ ముంబై వాసి 2-4 రూపాయల పెట్రోల్‌ను కారుపై కొట్టండి దాన్ని తగలబెట్టేస్తా’ అంటూ అగ్రహం వ్యక్తం చేసినట్లు బిగ్‌బీ సరదాగా  ట్వీట్‌ చేశాడు. 

ప్రస్తుత పెట్రోల్‌ ధరలు కూడా పెరగడంతో మంత్రి అవాద్‌ ఆ ట్వీట్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘మీ కారులో  ఇంధనం నింపాక బిల్లు చూడటం లేదా?  ఇప్పుడు మీరు మాట్లాడే సమయం వచ్చింది. పక్షపాతం వహించకుండా మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరల చూస్తే కార్లు నడపాలా, లేదా కాల్చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఆయన రాసుకొచ్చారు.

అదే విధంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ 2011 మే 16న పెట్రోల్‌ ధరలు పెంచడానికి ముందు చేసిన ట్వీట్‌ను కూడా మంత్రి షేర్‌ చేశారు. ‘‘ఈ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. పెట్రోల్‌ పంప్‌ ముందు క్యూ కడుతూ ప్రజలు ముంబై రోడ్లపైకి వచ్చారు’’ అంటూ చేసిన ట్వీట్‌కు మంత్రి ‘‘ఏంటీ మీరు ట్విటర్‌లో యాక్టివ్‌గా లేరా?, న్యూస్‌ పేపర్‌ ఫాలో అవడం లేదా, లేక కార్లను వాడటం మానేశారా?’’ అంటూ సరదాగా చమత్కరించారు. కాగా ముంబైలో ఇవాళ లీటరు పెట్రోల్‌ 86.91 రూపాయలు, లీటరు డీజిల్‌ 78.51 రూపాయలు ఉంది. 

Show comments