iDreamPost
android-app
ios-app

AP ప్రజలకు బిగ్ అలర్ట్… ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు పిడుగులతో భారీ వర్షాలు!

  • Published May 23, 2024 | 8:38 AM Updated Updated May 23, 2024 | 8:38 AM

Heavy Rains: మార్చి నెల నుంచి దంచి కొట్టిన ఎండలు మే నెలలో కాస్త చల్లబడ్డాయి. ఇటీవల వాతావరణంలో భారీ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

Heavy Rains: మార్చి నెల నుంచి దంచి కొట్టిన ఎండలు మే నెలలో కాస్త చల్లబడ్డాయి. ఇటీవల వాతావరణంలో భారీ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

AP ప్రజలకు బిగ్ అలర్ట్… ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు పిడుగులతో భారీ వర్షాలు!

గత వారం రోజుల నుంచి ఏపీలో వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి. ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. వాస్తవానికి మే నెలలు ఎండలు ముదిరి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. కానీ ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే నగర వాసులు మాత్రం ఎండవేడి తగ్గడంతో ఊరట చెందుతున్నారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫాన్ గా మారి పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ శాఖ పేర్కొంది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నడిన అల్పపీడనం ఉత్తర తమిలనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో ఏర్పడిన భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి బంగాళాఖాతంలో వాయుగుండగా బలపడనుంది. శనివారం సాయంత్రానికి తుఫానుగా మారి ఈశాన్య, వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ తుఫాన్ బలపడితే ఒమన్ సూచించిన విధంగా ‘రెమాల్’ గా పేరు పెడతారని తెలుస్తుంది. తుఫాన్ ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది.. మథ్స్యకారులు ఆదివారం వరకు సముంద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఈ నెల 25 న తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది.

Rains for 3 days in these districts of Ap

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు (మే 23) పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లా చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తామని ఐఎండీ శాఖ తెలిపింది. శుక్రవారం, శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని.. అవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించింది.