iDreamPost
android-app
ios-app

సాలిడ్ అండ్ స్ట్రాంగ్ – భీష్మ వీకెండ్ ఫిగర్స్

  • Published Feb 25, 2020 | 12:09 PM Updated Updated Feb 25, 2020 | 12:09 PM
సాలిడ్ అండ్ స్ట్రాంగ్ –  భీష్మ వీకెండ్ ఫిగర్స్

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తోంది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ ని అనుకూలంగా మలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి 14 కోట్ల 59 లక్షల షేర్ ఇచ్చిన భీష్మ రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకొని ఆపై అంతా లాభాలు ఇచ్చేలా ఉన్నాడు.

రైతులను ప్రోత్సహించే ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ యూత్ ఫామిలీస్ మెచ్చేలా కామెడీ యాక్షన్ తగుపాళ్ళలో ఉండేలా జాగ్రత్త పడిన వెంకీ కుడుముల ఇటు రైటర్ గానూ ప్రశంసలు దక్కించుకున్నాడు. హీరొయిన్ రష్మిక మందన్న గ్లామర్ తో పాటు పెర్ఫార్మన్స్ కూడా సినిమాకు బలంగా నిలిచింది. మహతి స్వర సాగర్ సంగీతం మరీ మేజిక్ చేయలేకపోయినా వాటే బ్యూటీ పాట మాత్రం బాగా ఆకట్టుకుంటోంది.

మొత్తం వసూళ్ళలో నైజాం నుంచి 5 కోట్ల 75 లక్షల దాకా షేర్ రాబట్టి భీష్మ అక్కడా డామినేషన్ చూపించాడు. సీడెడ్ లోనూ 2 కోట్లకు పైగా షేర్ రాబట్టి అటు ఓవర్సీస్ లోనూ తన సత్తా నిరూపించాడు. బ్రేక్ ఈవెన్ కు అతి దగ్గరలో ఉన్న భీష్మ ఇంకొద్దిరోజుల్లోనే ప్రాఫిట్స్ లోకి ఎంటరైపోతాడు. దగ్గరలో చెప్పుకోదగ్గ ఏ పోటీ లేదు. విశ్వక్ సేన్ హిట్ ఉంది కానీ అది క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఎంటర్ టైన్మెంట్ పరంగా భీష్మతో పోటీ పడలేదు. సో నితిన్ కు ఇంకో వారం పూర్తిగా తన కంట్రోల్ లోనే ఉంటుంది. రాబోయే వారాంతం కూడా భారీ వసూళ్లు ఖాయమనే నమ్మకం ట్రేడ్ వ్యక్తం చేస్తోంది. ఏరియాల వారీగా వచ్చిన రిపోర్ట్స్ ఇచ్చిన ఫిగర్స్ ఇవి

AREA SHARE
నైజాం  5.75cr
సీడెడ్   2.10cr
ఉత్తరాంధ్ర  1.75cr
గుంటూరు   1.35cr
క్రిష్ణ   1.08cr
ఈస్ట్ గోదావరి  1.21cr
వెస్ట్ గోదావరి  0.87cr
నెల్లూరు   0.48cr
Total Ap/Tg  14.59cr