ప్రభుత్వ కీలక నిర్ణయం.. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లపై నిషేధం!

నేటికాలంలో చాలా మంది సోషల్ మీడియాలో మునిగిపోతుంటారు. ఈ క్రమంలోనే ఓ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.

నేటికాలంలో చాలా మంది సోషల్ మీడియాలో మునిగిపోతుంటారు. ఈ క్రమంలోనే ఓ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చాలా మంది నెట్టింట్లోనే మునిగిపోయి..కాలం గడుపుతున్నారు. ఇక కొందరు అయితే ఫోన్ పట్టుకోవడంతోనే రోజును ప్రారంభిస్తుంటారు. చాలా మంది రోజులో ఎక్కువ టైమ్ ఫోన్లతో గడిపేస్తుంటారు. ఇది ఇలా ఉంటే వివిధ రకాల సమాచారాలు సోషల్ మీడియా ద్వారా మన ముందు ప్రత్యక్షమవుతుంటాయి. అలానే విద్వేష పూరిత వార్తలు, అసత్య వార్తలు కూడా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపిస్తుంటాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో వివిధ రకాల సోషల్ మీడియా అకౌంట్లను తాత్కాలికంగా, పూర్తిగా నిషేధిస్తుంటాయి. తాజాగా వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లపై  నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అయితే అది మన దేశంలో మాత్రం కాదులేండి. మరి.. ఎక్కడ, ఎందుకు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశంపై పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కాస్తా చల్లరిన నిరసనలు తిరిగి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్  నెట్ వర్కింగ్ సేవలైన ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ లపై నిషేధం విధించినట్లు నివేదికలు వచ్చాయి. దేశవ్యాప్తంగా  ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్‌లపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశంపై ఇంకా హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

గ్లోబల్ ఐస్ న్యూస్ శుక్రవారం తన అధికారిక ఎక్స్ అకౌంట్  లో  ఈ విషయాన్ని వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2 నుంచి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్‌తో సహా పలు సామాజిక మాధ్యమాలకు ఇంటర్నెట్‌ను పరిమితం చేసిందని ఆ సంస్థ వెల్లడించింది. మరోవైపు, మొబైల్ కనెక్షన్‌ల్లో ఫేస్‌బుక్, రష్యన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కి కూడా యాక్సెస్ బ్లాక్ చేయబడిందని మరికొన్ని నివేదికలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా 120 మిలియన్లకు పైగా మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది సోషల్ మీడియా సేవలను వినియోగిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బంగ్లా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పౌరులపై తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు అభిప్రాయాపడుతున్నారు.

గతకొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు మూడో వంతు కోటా ఇస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు నిరసనలు చేపట్టారు. అవి కాస్తా…తీవ్ర రూపం దాల్చి..పెద్ద విధ్వంసం చోటుచేసుకుంది. విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన క్రమంలో దాదాపు  దాదాపు 120కి పై  పౌరులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పరిస్థితి అదుపుతప్పి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో కనిపిస్తే కాల్చివేత అనే రూల్ ను అక్కడి ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా అకౌంట్లపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది.

Show comments