iDreamPost
android-app
ios-app

ఇంటి నుంచి పారిపోయిన బాలికలు.. కాపాడిన ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి.. చేసినవి చూడ్డానికి అనుకుంటాం. కానీ, ఇన్ స్టా ఆపదలో రక్షిస్తుందన్న విషయం తెలుసా? ఇంటి నుంచి పారిపోయిన బాలికలను రక్షించడంలో కీలకంగా మారింది. ఎలా అంటే?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి.. చేసినవి చూడ్డానికి అనుకుంటాం. కానీ, ఇన్ స్టా ఆపదలో రక్షిస్తుందన్న విషయం తెలుసా? ఇంటి నుంచి పారిపోయిన బాలికలను రక్షించడంలో కీలకంగా మారింది. ఎలా అంటే?

ఇంటి నుంచి పారిపోయిన బాలికలు.. కాపాడిన ఇన్‌స్టాగ్రామ్

సోషల్ మీడియా యాప్స్ లో ఇన్ స్టాగ్రామ్ కు ఉండే క్రేజ్ వేరు. ఎక్కువ మంది యూజ్ చేసేది ఇన్ స్టాగ్రామ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇన్ స్టాలో రీల్స్ చేయడం ఓ పనిగా పెట్టుకున్న వారు కోకొల్లలు. ఇన్ స్టా ఎంటర్ టైన్ మెంట్ కు మాత్రమే కాకుండా ఎర్నింగ్ కు కూడా యూజ్ ఫుల్ గా ఉంటోంది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇన్ స్టా అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఖాళీ సమయాల్లో రీల్స్ చూస్తూ రిలాక్స్ పొందుతుంటారు. అయితే ఇన్ స్టా వల్ల ఇబ్బందులు లేకపోలేదు. ఇన్ స్టాలో పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడే ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

పోకిరీలు అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇన్ స్టాలో పరిచచమైన వారి కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ బాలిక ఇన్ స్టాలో పరిచయమైన ప్రియుడికోసం వెళ్లి హత్యకు గురైంది. సోషల్ మీడియా ఎన్నో దారుణాలకు కారణమవుతున్నది. ఇలాంటి తరుణంలో ఇన్ స్టా గ్రామ్ ఓ మిస్సింగ్ కేసులో కీలకంగా మారింది. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను ఇంటికి చేర్చేలా చేసింది. అమ్మాయిలను కాపాడడంలో ఇన్ స్టా కీలకపాత్ర పోషించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన ఇద్దరు బాలికలు ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.

ఇందులో ఓ బాలిక సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల. కాగా ఈ బాలిక అక్కడి సూర్యలంక బీచ్ గురించి తరచుగా చెప్తుండేది. దీంతో రెండో బాలికకు బీచ్ చూడాలని ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో సూర్యలంక బీచ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రోజు మాదిరిగానే స్కూల్ కు వెళ్లిన ఇద్దరు తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎక్కడ వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ క్రమంలో స్కూల్ దుస్తుల్లో ఓ భవనంలోకి వెళ్లిన ఇద్దరు బాలికలు సాధారణ డ్రెస్సుల్లో బయటకు రావడం గుర్తించారు. ఇక్కడే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.

బాలికల ఇన్ స్టా అకౌంట్ లపై ఆరా తీశారు. ఆ తర్వాత ఇన్ స్టా లొకేషన్ ఆధారంగా బాలికలు బాపట్ల వైపు వెళ్తున్నట్టుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలను సూర్యలంక బీచ్ మార్గమధ్యలో అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. బాలికలు సేఫ్ గా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇన్స్టా ద్వారా ఈజీగా మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. ఆపదలు తెచ్చిపెట్టడమేమోగాని ఆపదలో రక్షించడంలో ఇన్ స్టా కీలకంగా మారడంతో చర్చనీయాంశంగా మారింది. మరి మిస్సింగ్ కేసులో కీలకంగా మారిన ఇన్ స్టాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.