iDreamPost
iDreamPost
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సవారి నిరాటంకంగా కొనసాగుతోంది. మొన్న శుక్రవారం వచ్చిన లక్ష్య, గమనం లాంటి సినిమాలు నిరాశ పరచడంతో వీకెండ్ నిన్నటి నుంచే అఖండ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు వేసుకుంటోంది. సీడెడ్ లాంటి ప్రాంతాల్లో సెకండ్ షోల నుంచే స్క్రీన్లు యాడ్ అయ్యాయి. నైజామ్ లోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. రిలీజై పది రోజులు దాటుతున్నా చాలా చోట్ల 90 శాతం పైగా ఆక్యుపెన్సీని కంటిన్యూ చేయడం రేంజ్ ఎక్కడికి వెళ్లిందో అర్థమయ్యేలా చేసింది. డిసెంబర్ 2 తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ లేకపోవడం అఖండకు చాలా ప్లస్ అయ్యింది. తెలంగాణలో సెకండ్ వీక్ చూస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
కేవలం పది రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించిన మొదటి బాలకృష్ణ సినిమాగా అఖండ రికార్డు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ ఇంత ఫాస్ట్ గా చేరుకోవడం ఊహించనిదే. బాలయ్య బోయపాటి మాస్ కాంబినేషన్ హ్యాట్రిక్ ఇచ్చేసింది. సింహా లెజెండ్ లను అవలీలగా దాటేసిన అఖండ కెరీర్ హయ్యెస్ట్ గా నిలవడం కూడా లాంఛనమే. 17న పుష్ప వచ్చే దాకా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో దక్కుతున్న ఆదరణ ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ట్రాక్టర్లు వేసుకొచ్చి మరీ గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను ముంచెత్తడం ఈ మధ్యకాలంలో దేనికీ జరగలేదు. ఇక ఏరియాల వారీగా లెక్కలు ఇలా ఉన్నాయి
నైజామ్ – 16 కోట్ల 52 లక్షలు
సీడెడ్ – 12 కోట్ల 73 లక్షలు
ఉత్తరాంధ్ర – 5 కోట్ల 7 లక్షలు
తూర్పు గోదావరి – 3 కోట్ల 49 లక్షలు
పశ్చిమ గోదావరి – 2 కోట్ల 77 లక్షలు
కృష్ణా – 3 కోట్ల 1 లక్ష
గుంటూరు – 4 కోట్ల 3 లక్షలు
నెల్లూరు – 2 కోట్ల 16 లక్షలు
ఏపి తెలంగాణ 10 రోజుల షేర్ – 49 కోట్ల 80 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 4 కోట్ల 3 లక్షలు
ఓవర్సీస్ – 4 కోట్ల 76 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా పది రోజుల షేర్ – 58 కోట్ల 59 లక్షలు
ఇవాళ ఆదివారం పరిస్థితి ఇంకా మెరుగ్గా కనిపిస్తోంది. చాలా కేంద్రాల్లో డెఫిషిట్లు ఇస్తున్న సినిమాలు తీసేసి అఖండనే వేస్తున్నారు. ముఖ్యంగా ఈవెనింగ్ షోలకు డిమాండ్ విపరీతంగా ఉంది. నిన్న రాత్రి హైదరాబాద్ సుదర్శన్ లాంటి థియేటర్లలో మొత్తం సోల్డ్ అవుట్ కావడం దీనికి నిదర్శనం. కర్నూల్ కేంద్రంలో ఆల్రెడీ 1 కోటి గ్రాస్ రావడం గురించి ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇలా అన్ని సెంటర్స్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వంద కోట్ల షేర్ అసాధ్యం కానీ 70 కోట్ల దాకా రీచ్ అయ్యే ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది. కానీ అది పుష్ప పార్ట్ 1 టాక్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా సినిమాలు క్యూ కట్టిన నేపథ్యంలో ఈ టాస్కు అంత సులభం కాదు
Also Read : Samantha Song In Pushpa : పుష్ప ఐటెం సాంగ్ అదరగొడుతోంది