iDreamPost
android-app
ios-app

Atrangi Re Report : అత్ రంగీరే రిపోర్ట్

  • Published Dec 25, 2021 | 8:46 AM Updated Updated Dec 25, 2021 | 8:46 AM
Atrangi Re Report : అత్ రంగీరే రిపోర్ట్

క్రిస్మస్ పండగ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అత్ రంగీరే మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ – ధనుష్ కాంబినేషన్ కావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ నిర్మాతలు ఓటిటి వైపే మొగ్గు చూపారు. కారణం భారీ ఆఫర్. ఏఆర్ రెహమాన్ సంగీతం, ట్రైలర్ తదితర ప్రమోషనల్ మెటీరియల్ తదితరాలు సినిమా విడుదలకు ముందే హైప్ ని పెంచేశాయి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ట్రయాంగులర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ కు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. జీరో డిజాస్టర్ తర్వాత తీసిన చిత్రమిది. ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విష్ణు(ధనుష్)కు తన లవర్ మందాకినీ(డింపుల్ హయాతి)అంటే ఇష్టం. కానీ కాలేజీ ట్రిప్ కోసం విష్ణు బీహార్ వెళ్ళినపుడు అతనికి బలవంతంగా రింకు(సారా అలీ ఖాన్)తో పెళ్లవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రింకు కూడా అప్పటికే ఇంద్రజాలికుడు సజ్జద్(అక్షయ్ కుమార్)ప్రేమలో ఉంటుంది. విష్ణు జీవితంలో అన్ని పోగొట్టుకున్నవాడిగా మారిపోతాడు. అయితే రింకు సజ్జద్ ల జంటకు సంబంధించి ఒక మెలిక ఉంటుంది. అదేంటో ఈ రెండు జంటల ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుకుందో, విష్ణు ఫైనల్ గా సంతోషపడ్డాడా లేదా అనేది తెలియాలంటే సినిమాలోనే చూడాలి.

విష్ణు క్యారెక్టర్ లో ధనుష్ బెస్ట్ ఇచ్చేశాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎమోషన్స్ లో అదరగొట్టేశాడు. సారా అలీ ఖాన్ లో మంచి నటి ఉందనే విషయం ఇందులోనే బయటపడింది. జబ్ వీ మెట్ లో కరీనా కపూర్ ని గుర్తుకు తెచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరి తర్వాతే సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ గురించి చెప్పుకోవాలి. అత్ రంగీరే టిపికల్ పాయింట్ తో రూపొంది ఇలాంటి జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరుస్తుంది. అమ్మాయిల ఎమోషన్స్ ని ఆనంద్ ఎల్ రాయ్ ప్రొజెక్ట్ చేసిన తీరు చాలా బాగుంది. రెహమాన్ గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. చాలా కాలం తర్వాత తన మార్కు చూపించారు. న్యూ ఏజ్ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ ని ఏ మాత్రం నిరాశపరచకుండా సాగే అత్ రంగీరేని వీకెండ్ వాచ్ గా పెట్టేసుకోండి. తెలుగు వెర్షన్ ఇవ్వకపోవడం బ్యాడ్ లక్

Also Read : WWW Report : WWW సినిమా రిపోర్ట్

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/