ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసే ఉదేశ్యం లేదని ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. తెలంగాణా, తమిళనాడు ప్రభుత్వాలు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.
కాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటనతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అనగా జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్నాయి. మార్చి నెల చివరలో రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడకుండా విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 11 పేపర్లకి బదులు 6 పేపర్లకి కుదించి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.