Idream media
Idream media
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి భేటీ అయ్యారు.
ఇందుకోసం ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ కు కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపి మిదున్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం..
విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్ల సంస్థల విభజనతో పాటు పలు పెండింగు అంశాలపైనా చర్చించారట. విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపుపై ఇద్దరు సీఎంలు గతంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ కేసీఆర్ ను కలవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన అంశాలు, నదీ జలాల తరలింపుతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.