Idream media
Idream media
ఎన్నికల మెనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానమని చెప్పిన సీఎం జగన్ అందులో పెట్టిన ప్రతి అంశం అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్కొక్కటిగా మెనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తున్నారు. తొలి హామీ ఫించన్ పెంపు నుంచి అమ్మ ఒడి వరకూ అనేక హామీలకు కార్యరూపం ఇచ్చారు.
ఎన్నికల హామీలో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు రాష్ట్రంలో 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున చేపట్టబోతున్నారు. ఈ పథకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నారు.
ఒక పథకం అమలు చేసిన వెంటనే మరో పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారికి వడ్డీ లేకుండా 10 వేల రుణం ఇచ్చే పథకాన్ని జూన్ నెలలో అమలు చేయబోతున్నారు. ఈ మేరకు సీఎం జగన్ తన ఆలోచనను నిన్న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో వెల్లడించారు.
పెట్టుబడి కోసం అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ఉండేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. ఎన్నికల సభలో సీఎం జగన్ ఈ హామీని ఇచ్చారు. తోపుడు బడ్లు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం 10 వేలు ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పిన మాట తొలి ఏడాదిలోనే అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక సులువుగా జరగనుంది.