iDreamPost
android-app
ios-app

కష్టకాలంలోనూ అన్నదాతకు అండ

కష్టకాలంలోనూ అన్నదాతకు అండ

ప్రజా సంకల్ప మహా పాదయాత్రలో నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన మాటను తు చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తన కుటుంబానికి సాటి మరోకరులేరని నిరూపిస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి ప్రభుత్వానికి మూడు నెలలుగా ఆదాయం లేకపోయినా.. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు చెప్పిన మాట ప్రకారం ఖరీఫ్‌ ప్రారంభంలోనే పెట్టుబడి సొమ్ము ఇస్తున్నారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌ రైతు భరోసా సొమ్ములు అన్నదాతల ఖాతాల్లో నేటి నుంచి జమ చేయనున్నారు. ఈ పథకం గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో ఏడాది రెండో విడద నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం తాజాగా 5,500 రూపాయలు జమ చేసేందుకు సిద్ధమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా రైతు భరోసాకు అర్హులైన వారి నుంచి కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిచింది. ఇందుకు సబంధించిన ప్రక్రియ గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ల సహకారంతో పూర్తి చేసింది. ఈ నెల 10వ తేదీ వరకూ కొత్త దరఖాస్తులు సీకరించారు. దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలపై కూడా వాలంటీర్లు సర్వే నిన్నటితో పూర్తి చేశారు. తాజా లబ్ధిదారులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 49,43,590 మంది అన్నదాలకు 5,500 చోప్పున దాదాపు 2,800 కోట్ల రూపాయలు పెట్టుబడి కోసం అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ యోజన పథకం కింద 6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా కింద 7,500 వెరసి మొత్తం 13,500 రూపాయలను ప్రతి ఏడాది మూడు దఫాల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు నెల మేలో 7,500, అక్టోబర్‌లో 4,000, జనవరి మాసం సంక్రాంతికి ముందు 2,000 చొప్పున ఇవ్వనున్నారు, అర్హతే ఆధారంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జగన్‌ సర్కార్‌ అన్ని ప్రభుత్వ పథకాలను అందిస్తోంది.