iDreamPost
iDreamPost
లాక్ డౌన్ టైంలో థియేటర్లో మిస్ అయిన ఎంటర్ టైన్మెంట్ ని వెతికే పనిలో ప్రేక్షకులు యమా బిజీగా ఉన్నారు. అందులోనూ సినిమా హళ్ళ నుంచి త్వరగా వెళ్ళిపోయిన వాటి మీద గట్టిగానే ఓ లుక్ వేస్తున్నారు. అందులో ఎక్కువగా అటెన్షన్ తీసుకుంటున్న మూవీ అనుకున్నది ఒక్కటి ఆయనది ఒక్కటి. నలుగురు అమ్మాయిలు కలిసి ఓ పెళ్లి కోసం గోవా వెళ్తారు. అక్కడ వీళ్ళ తొందరపాటు వల్ల ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆ హత్య కాబడిన వ్యక్తి ఎవరు, అతనికి వీళ్ళకు ఏమిటి సంబంధం, ఈ గండం నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఇందులో అసలు పాయింట్.
ఆ నలుగురిగా ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ది ఎడ్నాని నటించారు. చాలా బోల్డ్ గా ఉండే మనస్తత్వంతో వీళ్ళ పాత్ర చిత్రణను దర్శకుడు బాలు అడుసుమిల్లి బాలీవుడ్ స్టైల్ లో డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు. కంటెంట్ పరంగా ఇది పిల్లలతో చూసేది కాకపోయినా పెద్దల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది. నలుగురు హీరోయిన్లు గ్లామర్ తో పాటు కావలసినంత ఫన్ కూడా ఇచ్చారు. నలుగురిలో ఎక్కడ కామెడీ టచ్ తో కోమలి ప్రసాద్ క్యారెక్టర్ ఆకట్టుకుంది.
వీళ్ళలో ప్రేక్షకులకు బాగా పరిచయమున్న అమ్మాయి ధన్య బాలకృష్ణ. తనదైన శైలిలో చేసుకుంటూ పోయింది. ఇన్స్ పెక్టర్ గా సమీర్ పాత్రకు తగ్గట్టు అనుభవంతో నెట్టుకొచ్చాడు. బిగ్ బాస్ తో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజ కామెడీ పరంగా వర్క్ అవుట్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నించింది. వికాస్ బసిస సంగీతం థీమ్ కు తగ్గట్టుగా ఉంది. ఫీమేల్ ఫ్రీడమ్ కాన్సెప్ట్ తీసుకున్న బాలు దాన్ని క్రైమ్ కామెడీతో కలిపి చూపించిన ప్రయత్నమిది. ఖాళీ సమయం ఎలాగూ పుష్కలంగా దొరుకుతోంది కాబట్టి ఫ్రీటైంలో ప్రైమ్ లో దీని మీద ఓ లుక్ వేయొచ్చు.