నీటి వాడకం మీద ఆంధ్రజ్యోతి విష ప్రచారం ఎందుకు? అనంతపురం రైతుల మీద కోపమా?

రాజకీయాలకు
సంబంధించి పొగడ్తకు ఒక తెల్లఆవు కథ
, విమర్శకు మరో నల్లఆవు కథ మీడియా దగ్గర ఎల్లవేళలా సిద్ధంగా అంటుంది.
సందర్భాన్ని బట్టి
,అవసరాన్ని బట్టి
పాత్రల పేర్లు మారుస్తూ అప్పటికప్పుడు వార్త వండి వారుస్తారు.ఆంధ్రజ్యోతి పత్రిక
రాసే రాజకీయ వార్తలు చదివే వారికి అందులోని డొల్లతనం గురించి బాగా తెలుసు.ఇప్పుడు
ఏకంగా సాగు నీటి పారుదల విషయంలో ఆంధ్రజ్యోతి
,ABN మరో ముందడుగు వేసి విష వార్తలు రాయటం మొదలు
పెట్టింది.

ఈ సంవత్సరం దాదాపు 100 రోజులపాటు వరద రావడంతో ఎనిమిది సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీరు ఇచ్చారు. వాడుకోగలిగిన నీళ్లు వాడుకున్నా 1000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది.ఈ పరిస్థితిలో రైతులు సాగు నీటికి ఇబ్బంది పడుతున్నారని రాయటానికి ఏ పత్రికైనా ఆలోచిస్తుందేమో కానీ,నిత్యం ప్రభుత్వంపై ఎదో ఒక విషయంలో దాడి చేసే ఆంధ్రజ్యోతి ఏకంగా KC Canal నీళ్లను అక్రమంగా అనంతపురం జిల్లాకు ఇస్తున్నారని , దీనివల్ల KC Canal ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతుందని కర్నూల్ జిల్లా ఎడిషన్ లో వార్త రాసింది. గత ఐదు సంవత్సరాలుగా KC Canal కు దక్కవలసిన నీటిని అనంతపురానికి ఇచ్చారని కూడా రాసింది. జిల్లాకు అన్యాయం జరుగుతున్నా చేవ చచ్చిన కర్నూల్ జిల్లా నాయకులు పట్టించుకోవటం లేదని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణితో వార్తను ప్రచురించింది.

ముఖ్యమంత్రి జగన్ పై కక్షగట్టిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎడారిగా మారుతున్న అనంతపురానికి నీళ్లు ఇవ్వటం మీద కూడా ఇంత ద్వేషపూరిత వార్తలు రాయటం సహించరానిది.ఈ వార్త రాసిన పాత్రికేయుడు వాస్తవాలు తెలుసుకోకుండా రాసినట్లు చదివినవారికి అర్ధమవుతుంది. అనంతపురానికి 2 టీఎంసీల నీళ్లు ఇచ్చిన వార్తను మాత్రమే రాసిన ఆంధ్రజ్యోతి KC Canal కు 4 టీఎంసీ ల నీటిని కేటాయించారనే వార్తను ఉద్దేశ్యపూర్వకముగానే రాయలేదు.

KC Canalకు ఎక్కడి నుంచి
నీళ్లు వస్తాయి
?

కర్నూలు పట్టణానికి 25 కి.మీ ఎగువున తుంగభద్ర నదిపై సుంకేసుల వద్ద 150 సంవత్సరాల కిందట ఆనకట్ట కట్టారు.అక్కడ నుంచి కడప టౌన్ దగ్గరలోని చెరువు వరకు కాలువ తవ్వి దానికి కర్నూలు-కడప కాలువ (KC Canal) అని పేరుపెట్టారు. దేశ చరిత్రలో తొలిసారిగా జరిగిన నదుల (తుంగభద్రా – పెన్నా) అనుసంధానం ఇది. స్వాతంత్రం వచ్చిన తరువాత ఆనకట్ట తొలగించి 1.2 టీఎంసీ నిలువ సామర్థ్యంతో రిజర్వాయర్ కట్టారు.ప్రస్తుతం పూడిక వలన నిలువ వాస్తవ సామర్ధ్యం 0.90 టీఎంసీ మాత్రమే.ఈ రోజుకి అంటే 12-Jan-2020 నాటికి 0.8 టీఎంసీల నీరు ఈ రిజర్వాయర్లో నిల్వ ఉంది.

అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చే HLC (High Level Canal )కు హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్(TB Dam) నుంచి బచావత్ ట్రిబ్యునల్ మరియు బ్రిజేష్ ట్రిబ్యునల్ 32.50 టీఎంసీ కేటాయించాయి.కానీ కర్ణాటక అక్రమంగా నీరు వాడుకోవటం,వర్షాభావం తదితర కారణాల వలన 20-25 టీఎంసీల నీళ్లు కూడా అనంతపురానికి చేరటం లేదు.

Also Read: తుంగభద్ర డ్యామ్

సుంకేసుల డ్యాం నుంచి మొదలయ్యే KC Canalకు బచావత్ ట్రిబ్యునల్ 39.90 టీఎంసీ లు కేటాయించగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో KC Canal కు మరమత్తులు చేసి ఆధునీకరించడంతో కొంత నీటిని ఆదా చేశారు. ఇలా ఆదా చేసిన నీటిలో 8 టీఎంసీల నీటిని SRBC కి కేటాయించారు. దీనితో 2013లో బ్రిజేష్ ట్రిబ్యునల్ KC Canal కు గతంలో కన్నా తక్కువగా 31.90 టీఎంసీ నీటిని కేటాయించింది. ఆంధ్రజ్యోతిలో వార్తా రాసిన జర్నలిస్టుకు బచావత్ ట్రిబ్యునల్ తరువాత బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిన విషయం తెలిసినట్లు లేదు.ఒకవేళ బ్రిజేష్ ట్రిబ్యునల్ పై సుప్రీం కోర్టులో ఉన్న కేసు వలన ఇంకా అవార్డు కాలేదు అనుకున్న బచావత్ కేటాయించిన 39.90 టీఎంసీలను ప్రస్తావించకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ కేటాయించిన 31.90 టీఎంసీ లను ప్రస్తావించడంలోనే అవగాహనా లేమి అర్థమవుతుంది.రాజకీయ విమర్శకు కోసం ఎడారిలా మారుతున్న ఒక ప్రాంతానికి సాగునీటి పారుదల జరిగితే దానిపై విషపూరిత వార్తలు రాయడం దుర్మార్గం.

KC Canal కు కేటాయించిన 31.90 టీఎంసీల నీటిలో 10 టీఎంసీ లు హోస్పేట్ TB Dam నుంచి విడుదల చెయ్యాలి. మిగిలిన నీరు తుంగభద్ర డ్యామ్ ,సుంకేసుల డ్యామ్ మధ్య ఉన్న కాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షం ,వాగుల నుంచి వచ్చిన నీటితో సమకూరాలి.

1997-2004 మధ్య కరువు రోజుల్లో HLC నుంచి ఐదు, పది టీఎంసీల నీళ్లు కూడా అనంతపురానికి పారలేదు. అనంతపురం రైతులు తమకు హొస్పెట్ TB Dam నుంచి ఎక్కువ నీటిని విడుదల చెయ్యమని కోరగా పట్టించుకోని చంద్రబాబు చివరికి ఎన్నికలకు నాలుగు నెలల ముందు 2004 జనవరిలో అంగీకరించి TB Dam నుంచి సుంకేసులకు రావలసిన 10 టీఎంసీలలో 5 టీఎంసీ లను అనంతపురానికి ఇవ్వమని 21-Jan-2004 న GO – 10 ని విడుదలచేశారు. ఆ ఆవిధంగా KC Canal వాటాలో తొలిసారి కోత పడింది చంద్రబాబు హయాంలో.

వైస్సార్ ముఖ్యమంత్రి అయినా తరువాత అనంతపురం రైతులు ,నాయకుల కోరిక మేరకు తుంగభద్ర నుంచి మరో 5 టీఎంసీల నీటిని అంటే చంద్రబాబు ఇచ్చిన 5 టీఎంసీలతో కలుపుకొని మొత్తం 10 టీఎంసీ లను TB Dam నుంచి అనంతపురం లోని PABR డ్యామ్ కు కేటాయిస్తూ 14-May-2005న GO-698 ను విడుదల చేశారు.  

వైఎస్సార్ కూడా KC
Canal ఆయకట్టుకు అన్యాయం చేశాడా?

వైఎస్సార్ తో రాజకీయంగా విబేధించవచ్చు కానీ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థకు ఆయన దార్శనికుడు…

KC కెనాల్ సుంకేసులవద్ద మొదలవుతుంది. ఈ కాలువ70 కి.మీ వద్దమాల్యాల వద్ద హంద్రీ-నీవా ఎత్తిపోతల,75
కి.మీ వద్ద ముచ్చుమర్రి  ఎత్తిపోతల,120
కి.మీ వద్ద బానకచెర్ల ఉన్నాయి. సుంకేసుల నుంచిKC canal కు నీరు రాకుంటే నష్టపోయేది 0 – 70 కి.మీ మధ్య
ఉన్న ఆయకట్టుదారులు. ఈ భూములకు నీళ్లు ఇవ్వటం కోసం ముచ్చుమర్రి వద్ద 
టీఎంసీల నీటిని KC Canalలో ఎత్తిపోసే లక్ష్యంతో ఒక ఎత్తిపోతల పథకాన్ని వైఎస్సార్ మొదలుపెట్టారు. దీనితోపాటు  హంద్రీ-నీవాకు కూడా నీళ్లు ఇవ్వటం కోసం ముచ్చుమర్రి నుంచి మల్యాల వద్ద
ఉన్నహంద్రీ-నీవా లిఫ్ట్ వరకు ఒక కాలువ తవ్వించారు.

ముచ్చుమర్రి పంప్ హౌస్ కు ఎదురుగా కేవలం 100 మీటర్ల దూరమలో KC Canal ఉంది. ఇక్కడ గేట్లు పెట్టి నీటిని రివర్సులో 70 కి.మీ నుంచి కర్నూల్ వరకు నీటిని పారిస్తారు. ఈ విధానంలో 2017,2018లో చంద్రబాబు హయాంలో విజయవంతంగా నీటిని పారించారు.

మాల్యాల వద్ద లిఫ్ట్ హంద్రీ-నీవా లిఫ్ట్ ఉండగా ముచ్చుమర్రి ఎందుకు?

మాల్యాల వద్ద నీటిని లిఫ్ట్ చెయ్యాలంటే శ్రీశైలంలో 834 అడుగులు వరకు నీళ్లు ఉండాలి. అదే ముచ్చుమర్రి వద్ద అయితే శ్రీశైలంలో 798 అడుగులు వరకు నీళ్లు ఉంటేచాలు. ఈ కారణంతోనే ముచ్చుమర్రి వద్ద కొత్త ఎత్తిపోతల పథకాన్ని వైస్సార్ ప్రారంభించారు. ఆయన మరణంతో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు 2017లో చంద్రబాబు హయాంలో పూర్తి అయ్యింది.

Also Read: నీటి కలల సాకారం దిశగా- మూడు శంకుస్థాపనలు

KC Canal కు నీటికి ఉన్న ఇతర అవకాశాలు ఏవి?

TB Dam నుంచి అధికారికంగా సుంకేసులకు నీటి కేటాయింపు లేకున్నా ఒక మోస్తరు వర్షాలు కురిసిన ప్రతి సంవత్సరం బాగానే నీళ్లు వస్తాయి. చంద్రబాబు చెప్పినట్లు ముచ్చుమర్రి రాయలసీమ జీవనాడి అనే స్థాయి ప్రాజెక్ట్ కాదు కానీ అవసరం ఉననప్పుడు రెండు,మూడు టీఎంసీ ల నీటిని KC Canalకు లిఫ్ట్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది.

మాల్యాల వద్ద ఉన్న హంద్రీనీవా ఎత్తిపోతల పంప్ హౌస్ కు 100 మీటర్ల దూరంలో KC Canal ఉంది. హంద్రీ-నీవా నుంచి రెండు పైపులను KC Canal కు కలిపారు. అవసరమైనప్పుడు ఈ పైపుల ద్వారా KC Canal కు నీరు ఇవ్వవచ్చు. హంద్రీ నీవా పథకం వద్ద భూమి మీద KC Canal పోతుంటే పైన దాదాపు 35-40 అడుగుల ఎత్తులో హంద్రీ-నీవా కాలువ అక్విడేట్ మీదుగా కాలువ మొదలవుతుంది,ఒకే సారి రెండు కాలవల్లో నీరు చూడటం అద్భుతమైన అనుభూతి.

ఇవి రెండు కాకుండా బానకచెర్ల వద్ద నిప్పులవాగు ఎస్కేప్ర్ ఛానెల్ ను వైఎస్సార్ అభివృదిచేశాడు . దీనివలన పోతిరెడ్డిపాడు నుంచి వచ్చిన నీరు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నుంచి ఎస్కేప్ వెంట్ ద్వారా నిప్పుల వాగుకు అక్కడ నుంచి సంతజూటూరు వద్ద KC Canal కు చేరుతుంది. సంత జూటూరు వద్దనే కాక మరో మూడు చోట్ల కుందూ నది నీళ్లు KC Canal లోకి పారించే ఏర్పాటు ఉంది. దీని వలనే KC Canal కు గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువ నీరు లభిస్తుంది.

ఆంధ్రజ్యోతి రాసినట్లు 2 టీఎంసీల KC Canal నీటిని HLC కి కేటాయించిన జగన్ పోతిరెడ్డి పాడు నుంచి KC Canalకు 4 టీఎంసీ లు కేటాయించకలిగింది పైన చెప్పిన కారణాల వల్లనే. గత 5 సంవత్సరాలలో కడపలో వరి సిరులు, గోదావరి జిల్లాల్లో కన్నా కడపలో వారి దిగుబడి ఎక్కువ వస్తుందని రాసిన ఆంధ్రజ్యోతికి, చంద్రబాబు అనంతపురానికి 50 టీఎంసీ లు ఇచ్చానని ప్రచారం చేసుకున్నప్పుడు ఈ లెక్కలు అడగాలని అనిపించకపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరికి నీళ్లు ఇస్తున్న సందర్భంలో రంధ్రాన్వేషణ చెయ్యటం మాత్రం విశ్వసనీయత కోల్పోవటమే.

ఆంధ్రజ్యోతి అక్కసుకు కారణం గత నెలలో కుందూ నది మీద జగన్ శంకుస్థాపన చేసిన రాజోలి,జాలదరాశి,బ్రహ్మం సాగర్ కు లిఫ్ట్ ప్రాజెక్టుల వలన KC Canal ఆయకట్టు ఉన్న ఆప్రాంతంలో జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణే. పారిన నీళ్లే రైతుకు సాక్ష్యం.. పత్రికలూ రాసిన అబద్దపు వార్తల ప్రభావం శూన్యం.

Also Read: ఆశలు రేపుతున్న జగన్-నీటి ప్రాజెక్టులు

KC Canal నీళ్లు అనంతపురానికి దోచిపెడుతున్నారని రాసిన రోజే అనంతపురం జిల్లా ఎడిషన్ లో “కృష్ణ కృష్ణ” పేరుతో అనంతపురానికి నీళ్లు రావటం లేదని వార్త రాసింది. దీన్నే విబేధాలు సృష్టించటం అనేది. “ఆల మట్టి” ఎత్తు పెంచటం వలన ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగిందని రాసిన ఆంధ్రజ్యోతి కర్ణాటక ఎడిషన్ లో మాత్రం ఆల మట్టి “ఎత్తు పెంచారా” అని రాసింది…

ఇదే రాధాకృష్ణ జర్నలిజం తీరు!!!

Show comments