iDreamPost
iDreamPost
దర్శకుడు సుకుమార్ టీమ్ విపరీతమైన ఒత్తిడిలో పుష్ప తాలూకు చివరి నిమిషం పనులను పూర్తి చేసే టెన్షన్ లో ఉంది. నిన్న సాయంత్రం దాకా క్యూబ్ అప్ లోడ్ జరగలేదన్న వార్త బన్నీ ఫ్యాన్స్ లో ఆందోళనకు దారి తీసింది. టైంకి యుఎస్ ప్రీమియర్లు పడకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. అందుకే కంటెంట్ డెలివరీ కోసం సుక్కు బృందం నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి ఆ కార్యాన్ని పూర్తి చేసింది. మరోవైపు అల్లు అర్జున్ ఒక్కడే ప్రమోషన్లను భుజాల మీద వేసుకుని నిన్న చెన్నై మీడియా మీట్ ఫినిష్ చేసి ఇవాళ రేపు బెంగళూర్, కోచి, ముంబై నగరాలను కవర్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇందులో ఒకటి రెండు మార్పులు ఉండొచ్చు కానీ తిరగడమైతే పక్కా.
మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన సూచన ప్రభావమో ఏమో కానీ మొత్తానికి పుష్ప పాన్ ఇండియా పబ్లిసిటీ మీద గట్టిగానే ఫోకస్ పెడుతోంది. విడుదలయ్యాక మరిన్ని ఈవెంట్లు చేసే ఆలోచన కూడా జరుగుతోంది. డిసెంబర్ 17 డేట్ కి కట్టుబడటం వల్లే ఇంత ప్రెజర్ వచ్చిందని, 24కి వాయిదా వేసుకుందామన్నా శ్యామ్ సింగ రాయ్, 83లు ఉండటంతో మార్చే అవకాశం లేకుండా పోయిందని నిర్మాతలు భావించారట. జనవరి 1 నుంచి బాక్సాఫీస్ పూర్తిగా ఆర్ఆర్ఆర్ మేనియాలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోగానే పుష్ప వీలైనంత రన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఏటికి ఎదురీది మరీ ఇంత రిస్కీగా వర్క్స్ ని కంప్లీట్ చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చాలా సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. నిన్న తమకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అదనపు షోలు, రేట్ల గురించిన క్లారిటీ కోసం థియేటర్ల యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ బుకింగ్స్ జోరు మీదున్నాయి. ప్రీమియర్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. పుష్పకు కూడా అలాంటి టాకే వస్తే అఖండని ఓవర్ టేక్ చేసి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మూడు గంటల నిడివితో వస్తున్న పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడం బన్నీకి చాలా అవసరం. సీక్వెల్ ని కూడా ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో కొనసాగించే అవకాశం ఉంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు
Also Read : Megastar And Mega Fan : చిరంజీవి నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ ఆగేలా లేదు