iDreamPost
android-app
ios-app

Pushpa : టార్గెట్ ని బన్నీ ఈజీగానే చేరుకోవచ్చు కానీ …

  • Published Dec 03, 2021 | 5:31 AM Updated Updated Dec 03, 2021 | 5:31 AM
Pushpa : టార్గెట్ ని బన్నీ ఈజీగానే చేరుకోవచ్చు కానీ …

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 విడుదలకు సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 6న ట్రైలర్ ని వదలబోతున్నారు. దాంతోనే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు వసూళ్లు చాలా కీలకం. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక జనం పూర్తి స్థాయిలో థియేటర్లకు రాకపోవడంతో మొన్నటి దాకా చాలా అనుమానాలు ఉండేవి. కానీ నిన్న అఖండ వాటిని పటాపంచలు చేసింది. మాస్ మూవీ కోసం జనం ఎంతగా తహతహలాడిపోతున్నారో కలెక్షన్ల సాక్షిగా ఒక్క రోజులోనే ఋజువు చేసింది. పద్దెనిమిది కోట్లకు పైగా షేర్ రాబట్టి రాబోయే భారీ చిత్రాలకు దారి చూపించింది.

సో ఇప్పుడు పుష్ప టెన్షన్ పడాల్సిన పని లేదు. బాలయ్యతో పోల్చుకుంటే అల్లు అర్జున్ మార్కెట్ పెద్దది. వంద కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేయబోతున్నారు. పైగా హిందీ తమిళం మలయాళం కన్నడ వెర్షన్లు కూడా విడుదల చేస్తారు. సో టాక్ కనక పాజిటివ్ గా వస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ చేరుకోవచ్చు. ఇప్పటిదాకా వచ్చిన నాలుగు పాటలు మంచి హిట్టయ్యాయి. రంగస్థలం రేంజ్ కాకపోయినా విజువల్ గా చూశాక వీటి స్థాయి పెరుగుతుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రీ రిలీజే ఈవెంట్ కూడా త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఓమిక్రాన్ వైరస్ తాలూకు పరిణామాల గురించి టీమ్ ఆలోచించే ఉద్దేశంలో లేదు

ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప డిసెంబర్ లోనే రావాలి. మైత్రి సంస్థ 17ని మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తోంది కాబట్టి ఇబ్బంది లేదు. నిన్న అఖండకు వచ్చిన రెస్పాన్స్ ని గమనిస్తే ఏ సెంటర్స్ లోనూ గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చాయి. పుష్ప అలాంటి రెగ్యులర్ మసాలా సినిమా కాదు. అడవి బ్యాక్ డ్రాప్ పుష్పరాజ్ అనే స్మగ్లర్ కథగా దర్శకుడు సుకుమార్ దీన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. కంటెంట్ కనక కరెక్ట్ గా ఉంటే అల వైకుంఠపురములో రికార్డులకు టార్గెట్ చేసుకోవచ్చు. అఖండ 52 కోట్ల దాకా బిజినెస్ చేయగా పుష్ప దానికి సరిగ్గా రెట్టింపు చేసుకుంటుంది. సో లక్ష్యం డబుల్ అయ్యింది కాబట్టి రిజల్ట్ కూడా అంతకు మించి రావాలి. చూద్దాం

Also Read : Akhanda : మాస్ సినిమా పవర్ ఏంటో చూపించింది