iDreamPost
android-app
ios-app

Ala Vaikunthapurramloo : థియేటర్లో ఆపారు సరే మరి ఛానల్ లో వస్తోందే

  • Published Jan 22, 2022 | 10:14 AM Updated Updated Jan 22, 2022 | 10:14 AM
Ala Vaikunthapurramloo : థియేటర్లో ఆపారు సరే మరి ఛానల్ లో వస్తోందే

ఈ నెల 26న థియేట్రికల్ గా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్ ఎట్టకేలకు ఆగిన సంగతి తెలిసిందే. దీనికి గాను వాటి హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ సంస్థకు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని మీడియా టాక్ వచ్చింది కానీ దానికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ రాలేదు. మొత్తానికి మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని ఫ్యాన్స్ ఫీలైన మాట వాస్తవం. పుష్ప ఇచ్చిన ఊపులో దీనికి కలెక్షన్లు భారీగా వచ్చేవన్న అంచనా ఆల్రెడీ ఉంది. ఈ పరిణామం వల్ల హిందీ రీమేక్ షెహజాదా సేఫ్ అయ్యిందని అందరూ అనుకున్నారు కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. కొత్త ట్విస్టు వచ్చింది.

ఇప్పుడీ డబ్బింగ్ వెర్షన్ ని శాటిలైట్ ఛానల్ దించాక్ లో ఫిబ్రవరి 6న ప్రీమియర్ చేయబోతున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. ఈ ఛానల్ ఎవరిదో అనుకునేరు. సదరు గోల్డ్ మైన్స్ యుట్యూబ్ ఛానల్ ఓనర్ మనీష్ షాదే. పేరు మనకు కొత్తగా అనిపిస్తుంది కానీ ఇందులో కేవలం డబ్బింగ్ సినిమాలు మాత్రమే ప్రదర్శిస్తారు. స్టార్ లాంటి వాటితో పోటీ పడుతూ టాప్ 5 పొజిషన్ లో ఉందంటేనే రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దాంట్లో ఇప్పుడు నేరుగా ప్రసారం చేస్తే రీచ్ ఎంత ఎక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే థియేటర్ వల్ల జరిగే డ్యామేజ్ కన్నా ఇప్పుడీ రూపంలోనే ఎక్కువ ఉంటుంది.

మరి ఇప్పుడీ ప్రసారాన్ని నిలుపుదల చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికి గోల్డ్ మైన్స్ వ్యవహారం బాగుంది. పుష్ప హిందీని థియేటర్లో వదలాలా వద్దా అని మీమాంస పడి ఆఖరికి భారీ లాభాలు మూటగట్టుకుంది. ఇప్పుడీ అల వైకుంఠపురములో రూపంలో మరోసారి ఐకాన్ స్టార్ బంగారు బాతులా మారుతున్నాడు. మొత్తానికి ఓటిటిలు, యుట్యూబ్, డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక నిర్మాతలు చాలా అలెర్ట్ గా ఉండకపోతే ఇలాంటి చిక్కులే వచ్చి పడతాయి. పైగా టీవీలో బన్నీ సినిమా అంటే నార్త్ ఆడియన్స్ ఖచ్చితంగా ఎగబడి చూస్తారు. మరి దించాక్ ఛానల్ లో సినిమాను దించుతారో లేక థియేటర్ లాగా డ్రాప్ అంటారో వేచి చూడాలి

Also Read : Khiladi : మరోసారి మార్గదర్శిగా మారుతున్న రవితేజ