iDreamPost
android-app
ios-app

Ala Vaikunthapurramloo :డబ్బింగ్ చేస్తున్నారు సరే మరి రీమేక్ మాటేమిటి

  • Published Jan 17, 2022 | 6:06 AM Updated Updated Jan 17, 2022 | 6:06 AM
Ala Vaikunthapurramloo  :డబ్బింగ్ చేస్తున్నారు సరే మరి రీమేక్ మాటేమిటి

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప ది రైజ్ పార్ట్ 1ని నార్త్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న తీరు బాలీవుడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రైమ్ లో వచ్చాక పనికట్టుకుని మరీ సెలబ్రిటీలు దీని మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అమెజాన్ ఎన్నడూ లేని రీతిలో పుష్పకు భారీ ప్రమోషన్లు చేస్తోంది. టీవీని సోషల్ మీడియాని విపరీతంగా వాడేస్తోంది. దెబ్బకు అల్లు అర్జున్ బ్రాండ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో బన్నీ దేశముదురు లాంటి పాత డబ్బింగ్ సినిమాలు బయటికి తీసి మరీ థియేటర్లలో ఆడిస్తున్నారు. అవి మంచి కలెక్షన్లు తెస్తున్నాయి కూడా. దీంతో ఇప్పుడు మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

2020 సంక్రాంతిని నాన్ బాహుబలి రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకున్న అల వైకుంఠపురములోని తాజాగా హిందీ డబ్బింగ్ చేసి జనవరి 26న దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. తమన్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో పాటు పూజా హెగ్డే, టబు, సచిన్ కెడ్కర్, సముతిరఖని లాంటి నోటెడ్ క్యాస్టింగ్ ఉండటంతో ఇది అక్కడి జనానికి త్వరగానే రీచ్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఐకాన్ స్టార్ బన్నీ ఫోటో ఆటోమేటిక్ గా బిజినెస్ చేసేస్తుంది. ఈ నెలాఖరు వరకు హిందీలో ఎలాంటి పెద్ద సినిమాల రిలీజులు లేవు. అందుకే దీన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో హక్కులు కొన్న గోల్డ్ మైన్స్ సంస్థ రంగంలోకి దిగింది

ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అల వైకుంఠపురములో హిందీ రీమేక్ వెర్షన్ కొంత కాలం కిందటే మొదలుపెట్టారు. షెహజాదా టైటిల్ తో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా షూటింగ్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ఫార్మాలిటీస్ అన్నీ మీడియా ఛానల్స్ లో వచ్చాయి. మరి ఇప్పుడు బన్నీ డబ్బింగ్ వెర్షన్ ని థియేటర్లలో వదిలితే అందరూ దాన్ని చూసేస్తారు. ఒకవేళ హిట్ అయితే షెహజాదా ఇరకాటంలో పడుతుంది. అలాంటప్పుడు ఇలా చేయడం ఆసక్తి కలిగించే పరిణామమే. ఒకవేళ క్యాన్సిల్ అవుతుందేమో చూడాలి. మొత్తానికి సౌత్ సినిమా సత్తా బాలీవుడ్ కు బాగా అర్థమవుతోంది. మాస్ కంటెంట్ ని ఇవ్వడంలో మనకు తిరుగు లేదని క్లారిటీ వచ్చేసింది

Also Read : Acharya & Sarkaru Vaari Paata : ఔను అందుకే వాళ్ళు తేదీలు మార్చుకున్నారు