iDreamPost
android-app
ios-app

వైకుంఠపురములో అసలు రహస్యం

  • Published Jan 16, 2020 | 9:10 AM Updated Updated Jan 16, 2020 | 9:10 AM
వైకుంఠపురములో అసలు రహస్యం

ఫ్యామిలీ ఆడియెన్స్ అండతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న అల వైకుంఠపురములో స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. సరిలేరు నీకెవ్వరుతో ధీటైన పోటీ ఎదురుకుంటున్న బన్నీ సినిమా సెలవులు పూర్తయ్యాక సైతం డామినేషన్ కొనసాగిస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అల్లు అర్జున్ అసలు తల్లి తండ్రులు జయరామ్-టబులు ఖరీదైన విల్లా.

ఇది సాధారణంగా మనం రెగ్యులర్ గా చూసే ఇల్లుగా కాకుండా చాలా ప్రత్యేకంగా అనిపించడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది అన్ని సినిమాల్లో చూపించే రెగ్యులర్ హౌస్ కాదు ఆర్ట్ డైరెక్టర్ వేసిన సెట్ అంతకన్నా కాదు. ఇది నిజంగానే హైదరాబాద్ లో ఉన్న ఒక ఖరీదైన మ్యాన్షన్. వివరాల్లోకి వెళ్తే ఎన్డిటివి చౌదరి కుమార్తె అత్త వారిల్లు ఇది. సుమారు 100 కోట్లకు పైగా అప్పట్లో దీని నిర్మాణానికి ఖర్చయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటిదాకా ఇందులో ఏ సినిమా యూనిట్ అడుగు పెట్టలేదు

హారిక హాసిని అధినేత రాధాకృష్ణకు ఆ యజమానులుకు దగ్గరి బంధుత్వం ఉండటంతో ఇలా దీన్ని అల వైకుంఠపురముగా వాడుకున్నారు. ఎక్స్ టీరియర్ గా కనిపించే కొన్ని సన్నివేశాలు మాత్రం స్టూడియోలో సెట్ వేశారు తప్పించి మిగిలిన భాగమంతా అందులోనే తీశారు. అందుకే అంత లావిష్ గా జయరాం పాత్రకు ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్టుగా ఇల్లు ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఖచ్చితంగా ఉండే ధనవంతుల కుటుంబాల దర్పాన్ని ఇందులో కూడా ఈ స్టైల్ లో చూపించారన్న మాట త్రివిక్రమ్. ఓవర్సీస్ లోనూ రచ్చ చేస్తున్న అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ గా నిలవడం ఖాయమని వసూళ్లను చూస్తే అర్థమైపోతోంది