iDreamPost
android-app
ios-app

రేసులో ముందుకొచ్చిన అక్కినేని హీరో

  • Published May 28, 2020 | 5:42 AM Updated Updated May 28, 2020 | 5:42 AM
రేసులో ముందుకొచ్చిన అక్కినేని హీరో

కెరీర్ ప్రారంభంలో కొన్ని సక్సెస్ లు ఉన్నప్పటికీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని హీరో సుమంత్ మళ్ళీ రావాతో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చారు. అయితే ఇదం జగత్, సుబ్రమణ్యపురం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించడంతో జాగ్రత్త పడ్డ సుమంత్ తాజాగా కపటధారి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాలూకు అప్ డేట్స్ రెగ్యులర్ గా బయటికి రాకపోవడంతో ఇది అయిపోయిందా లేదా అనే అనుమానం ఫ్యాన్స్ లో ఉండేది.

ఇప్పుడు స్వయంగా సుమంతే చెప్పాడు కాబట్టి ఇంకెలాంటి అనుమానం అక్కర్లేదు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కన్నడ బ్లాక్ బస్టర్ కవలుదారికి అఫీషియల్ రీమేక్. అక్కడ హేమంత్ రావు డైరెక్షన్ లో స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నిర్మించారు. చిన్న బడ్జెట్ తో రూపొంది ఘన విజయం సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచిందీ సినిమా. అందుకే సుమంత్ ఏరికోరి మరీ కపటధారిని చేస్తున్నారు. ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అనుకోని పరిస్థితుల్లో ఒక క్రైమ్ కేసు ఇన్వెస్టిగేషన్ లో దిగి దాని వల్ల అనూహ్య పరిణామాలు ఎదురుకోవడమే దీని కథ. ఆద్యంతం ఇంటరెస్టింగ్ గా నడిచే స్క్రీన్ ప్లే తో ఊహించని మలుపులతో ఇది సాగుతుంది.

రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు కాస్త దూరంగా అనిపించేలా ఉన్నా ఇందులో మంచి డ్రామా ఉంటుంది. విలన్ పాత్ర కూడా ఎవరూ ఊహించని రీతిలో డిజైన్ చేశారు. థియేటర్లు తెరిచాక తమ సినిమాలు వెంటనే విడుదల చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్న నిర్మాతలకు విభిన్నంగా కపటధారి రేస్ లో ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగూ సుమంత్ భారీ ఓపెనర్ కాదు కాబట్టి టాక్ పాజిటివ్ గా వస్తే మెల్లగా పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిర్మాణాంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కపటధారి లాంటి సినిమాలు పనులను వేగవంతం చేశాయి. చూస్తుంటే సుమంతే ముందు బరిలో దిగినా ఆశ్చర్యం లేదు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet