Akhanda & Shyam Singha Roy OTT : క్రేజీ సినిమాల డిజిటల్ ప్రీమియర్లు రాబోతున్నాయి

ఇంకో నాలుగు రోజుల్లో దిగ్విజయంగా నెల రోజులు పూర్తి చేసుకోబోతున్న బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో థియేటర్లన్నీ దాని కోసం ఖాళీ కాబోతున్నాయి. సింగల్ డిజిట్ లో కొన్ని అఖండ కోసం కంటిన్యూ అవ్వొచ్చు కానీ మెజారిటీ చోట్ల తీసేయడం ఖాయం. ఆపై రాధే శ్యామ్ ఉంది కనక అక్కడితో కథ ముగిసినట్టే. ఇక అందరి చూపు ఇప్పుడు ఓటిటి ప్రీమియర్ వైపు వెళ్తోంది. డిస్నీ హాట్ స్టార్ దీన్ని ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముందు జనవరి 2 అనుకున్నారని టాక్ వచ్చింది కానీ తాజాగా సంక్రాంతికి స్ట్రీమింగ్ ని ప్లాన్ చేశారని సమాచారం.

పెద్దతెరపైనే ఆ రేంజ్ లో ఆడిన అఖండ ఇక స్మార్ట్ స్క్రీన్ పై ఎన్ని రిపీట్ రన్లు వేసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య పెర్ఫార్మన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు భారీగా ఉన్నారు. బాలీవుడ్ మీడియాలోనూ దీని గురించి కవరేజ్ వచ్చింది కాబట్టి సబ్ టైటిల్స్ సహాయంతో నార్త్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూస్తారు. ఇక లేటెస్ట్ నాని హిట్ శ్యామ్ సింగ రాయ్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. జనవరి నెలాఖరున ప్రసారం చేసేలా ఒప్పందం జరిగిందట. అప్పటిదాకా ఈ సినిమా హాళ్లలో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి అది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. దీని తాలూకు ప్రకటన పండగ సందర్భంగానే వస్తుంది.

కాకపోతే పుష్ప పార్ట్ 1 ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఎదురు చూడక తప్పదు. అమెజాన్ ప్రైమ్ లో యాభై రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేశారట. సో ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారం దీన్ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా ఓటిటి లవర్స్ ఎదురు చూస్తున్నవి పెద్దగా లేవు. మళ్ళీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, బంగార్రాజుల కోసం వెయిటింగ్ ఉంటుంది. శాటిలైట్ ఛానల్స్ కంటే ముందే కొత్త సినిమాలను ఇస్తున్న ఓటిటిలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. థియేటర్లో చూసేందుకు వీలు కానీ ప్రేక్షకులు డిజిటల్ కోసం ఎదురుచూడటం ఇటీవలి కాలంలో సాధారణమయ్యింది. బ్లాక్ బస్టర్స్ అంటే ఆ క్రేజే వేరుగా ఉంటుంది

Also Read : Tollywood Hits Of 2021 : బాక్సాఫీస్ ను ఆదుకున్న తెలుగు సినిమాలు

Show comments