iDreamPost
iDreamPost
ఎట్టకేలకు అఖండ ఫైనల్ రన్ కు వచ్చేసింది. నూటా మూడు కేంద్రాల్లో యాభై రోజుల వేడుక జరుపుకుని హాట్ స్టార్ ఓటిటిలోనూ సంచలనాలు రేపుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రధాన కేంద్రాల్లో ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది కానీ వస్తున్న షేర్లు పెద్దగా తోడయ్యేవి కాదు. ఇప్పటికే మంచి లాభాలను అందుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఫలితం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఒకవేళ తెలంగాణ తరహాలో ఏపిలోనూ టికెట్ రేట్ల వెసులుబాటు ఉండి ఉంటే ఇంకో పది కోట్లకు పైగా అదనంగా వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. దీని సంగతి ఎలా ఉన్నా రిలీజైన తొలి రోజుల్లో అక్కడా రేట్లకు పెద్దగా అడ్డుకట్ట పడిన దాఖలాలు లేవు.
ఇక ఫైనల్ షేర్ సంగతి చూసుకుంటే అఖండ ఇప్పటిదాకా 70 కోట్లకు పైగా షేర్ ని రాబట్టుకుని బాలయ్య కెరీర్ బెస్ట్ గా టాప్ 1 లో నిలుచుంది. గ్రాస్ లెక్కలో చూసుకుంటే ఇది సుమారు 135 కోట్ల దాకా తేలుతుంది. ఇప్పటికీ వీకెండ్స్ లో మంచి ఫిగర్స్ వస్తున్నాయి. ఓటిటిలో వచ్చాక జనం భారీగా చూస్తున్న మాట వాస్తవం. గుంటూరు జిల్లాలో ఓ పల్లెటూరిలో ఓపెన్ గ్రౌండ్ లో తెరకట్టి ప్రొజెక్టర్ వేసుకుని మరీ షో చూసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా సెలబ్రిటీల ట్వీట్లు గట్టిగానే పడుతున్నాయి. మొత్తానికి ఊహించిన దానికన్నా చాలా అంటే చాలా పెద్ద విజయం అందుకున్నాడు అఖండ.
నైజామ్ – 21 కోట్లు
సీడెడ్ – 15 కోట్ల 90 లక్షలు
ఉత్తరాంధ్ర – 6 కోట్ల 30 లక్షలు
ఈస్ట్ గోదావరి – 4 కోట్ల 15 లక్షలు
వెస్ట్ గోదావరి – 4 కోట్ల 25 లక్షలు
గుంటూరు – 4 కోట్ల 80 లక్షలు
కృష్ణా – 3 కోట్ల 63 లక్షలు
నెల్లూరు – 2 కోట్ల 60 లక్షలు
ఏపి/ తెలంగాణ ఫైనల్ షేర్ – 62 కోట్ల 60 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 5 కోట్లు
ఓవర్సీస్ – 5 కోట్ల 70 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా ముగింపు షేర్ – 73 కోట్ల 13 లక్షలు
దగ్గరలోనూ పెద్దగా చెప్పుకునే రిలీజులు లేకపోయినా అఖండ ఇంతకన్నా అద్భుతాలు చేయడం కష్టమే. కాకపోతే ఫ్యాన్స్ ఆశిస్తున్నట్టు వంద రోజుల ప్రదర్శన పెద్దగా సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ భీమ్లా నాయక్ కనక ఫిబ్రవరి 25నే వస్తే మాత్రం దాదాపు థియేటర్లనీ ఖాళీ అవుతాయి. అంతకు ముందే రవితేజ ఖిలాడీ వస్తుంది కాబట్టి దానికీ స్క్రీన్లు వెళ్లిపోతాయి. సో డబుల్ డిజిట్ లో అఖండ హండ్రెడ్ డేస్ రావడం జరగని పని. ఒకవేళ పరిస్థితులు చక్కబడక కరోనా ఇంకో నెల రోజులు కొనసాగితే అప్పుడు ఛాన్స్ ఉంది. మొత్తానికి బాలయ్య కెరీర్ బెస్ట్ గా నిలిచిన అఖండ ప్రకంపనలు ఆన్ లైన్ లో ఇంకొద్దిరోజులు కొనసాగడం ఖాయం
Also Read : Baahubali : 150 కోట్లను లెక్కచేయకుండా నో అనేశారు