Idream media
Idream media
కరోనా..యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్…పేద ధనిక తేడా లేదు…దేశాధ్యక్షులు, రాజులు,మంత్రులు అధికారులు.. ప్రధానులు..ఎవరినీ ఉపేక్షించడం లేదు…అందర్ని ఒకేలా పరిగణిస్తూ తన గుప్పిట్లోకి తీసుకుని ఆల్లడిస్తోంది… అగ్రరాజ్యాలు అని చెప్పుకునే అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు కకావికాలం అవుతున్నాయి. ఆస్పత్రులు, అక్కడినుంచి వచ్చిన శవాలతో స్మశానాలు నిండిపోతున్నాయి… డబ్బున్నోళ్లు ఎన్-95 వంటి మాస్కులు, మాటి మాటికి చేతులు కడుక్కునేందుకు శానిటైజర్లు వాడుతున్నారు. మరి పదిరూపాయల మాస్క్, వంద రూపాయల శానిటయిజర్లు లేని నిరుపేదలు ఏమి చేస్తారు…వారి ప్రాణాలకు విలువలేదా…ఏమో ప్రబగుత్వం దృష్టిలో విలువ ఉందో లేదో గాని ఆ గిరిజనులు తమ ప్రాణాలకు తామే రక్షణ కల్పించుకున్నారు. కొత్త కాటన్ గుడ్డ కొని మాస్క్ కుట్టించుకునే స్తోమత లేని ఆ పేదలు దళసరిగా ఉండే పనస ఆకులనే మస్కులుగా మలచుకున్నారు..
విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీ లోని పాచిపెంట మండలం రొడ్డ వలస, మాలమామిడి ఇంకా కొన్ని గిరి శిఖర గ్రామాల్లోని గిరిజనులు ఆకులతోనే మాస్కులు చేసుకుని నోటికి అడ్డంగా పెట్టుకుని సామాజిక దూరం పాటిస్తున్నారు. తాము గతంలో నీళ్లకు గాని అడవికి గాని కలిసి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు అలా వెళ్లడం లేదని, దూరం దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు. ఏదో జబ్బు వచ్చిందట కదా…అది వస్తే చచ్చిపోతామట కదా ..అందుకే మేము ఈ ఆకులనే మాస్కుగా వాడుతున్నామని, తరచూ వాటిని మార్చేస్తుంటామని వాళ్ళు చెబుతున్నారు. ఆ తరువాత ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించాక కొందరు అధికారులు వారికి మాస్కులు పంపిణీ చేశారు..మొత్తానికి నగరవాసులకన్నా నాగరికతకు దూరంగా ఉండే గిరిజనులే చైతన్యంతో మిన్న అని వాళ్ళు చెప్పకనే చెప్పారు.