నిమ్మగడ్డకు షాక్: పునర్నియామక ఉత్తర్వులు వెనక్కి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు షాక్ తగిలింది. ఆయన పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఈమేరకు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) వాణీ మోహన్ వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే హైకోర్టు తీర్పు తర్వాత రమేశ్‌ కుమార్‌ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన అడ్వకేట్ జనరల్ శ్రీ రాం..రమేశ్‌ కుమార్‌ పునర్నియామకం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీంతో రమేశ్‌ కుమార్‌ పునర్నియామకానికి బ్రేకులు పడ్డాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నియామక ఉత్తర్వులు రాకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తనే భాద్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించడం…దానిపై ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించడంతో…ఆయన బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ప్రకటించారు.

అడ్వకేట్ జనరల్ శ్రీరాం ఏంట్రీతో దానికి బ్రేకులు పడ్డాయి. అప్పుడు ఇచ్చిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. పునర్నియామకంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున సర్క్యులర్‌ని వెనక్కి తీసుకున్నట్లు కమిషన్‌ అధికారి ఒకరు తెలిపారు.

Show comments