iDreamPost
android-app
ios-app

కరోనా బాధితులను పట్టిస్తే భారీ బహుమతి

  • Published Apr 16, 2020 | 5:54 AM Updated Updated Apr 16, 2020 | 5:54 AM
కరోనా బాధితులను పట్టిస్తే భారీ బహుమతి

కరోనా వైరస్ బాధితుడి ఆచూకి చెబితే పట్టించిన వాళ్ళకు భారీ బహుమతి ప్రకటించింది చైనా ప్రభుత్వం. వూహాన్ నగరాన్ని వైరస్ వణికించేసినపుడే చైనా ప్రభుత్వం బహుమతులు ప్రకటించలేదు. మరిపుడు ఎందుకు ప్రకటించింది ? ఎందుకంటే వైరస్ తీవ్రత మళ్ళీ మొదలైంది కాబట్టే. దాదాపు నాలుగు నెలల పాటు వైరస్ దెబ్బకు చైనా అల్లాడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ అని క్వారంటైన్ అని ఐసొలేషన్ అని చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్న తర్వాత మొత్తానికి వైరస్ తగ్గిపోయిందని అనుకున్నది.

అందుకనే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత లాక్ డౌన్ ఎత్తేసింది. వూహాన్ లోకి జనాలను అనుమతించింది. జన జీవనం మళ్ళీ యధావిధిగా మొదలైన తర్వాత హఠాత్తుగా వైరస్ మళ్ళీ బయటపడింది. దాంతో చైనా ప్రభుత్వం ఉలిక్కిపడింది. గడచిన వారం రోజుల్లో సుమారు 100 కేసులకు పైగా నమోదయ్యాయి. దాంతో మళ్ళీ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉంది చైనా ప్రభుత్వం.

సరే ఈ విషయం ఇలా వుండగానే విదేశాల నుండి చైనాలోకి వస్తున్న వాళ్ళ ద్వారానే మళ్ళీ వైరస్ సోకుతోందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించింది. అందుకనే ఎవరైనా కరోనా వైరస్ ఉన్న వాళ్ళ ఆచూకి చెబితే 5 వేల యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 54 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇంత సమస్య ఎందుకొచ్చిందంటే రష్యా నుండి చైనాలోకి జనాలు అక్రమంగా వచ్చేస్తున్నారట.

అందుకనే చైనా-రష్యా మధ్య సరిహద్దులను చైనా ప్రభుత్వం మూసేసింది. చైనాలో కేసుల తీవ్రగ బాగా ఉన్నపుడు రష్యా సరిహద్దులను మూసేసింది. అలాంటిది ఇపుడు రష్యాలో కేసుల తీవ్రత బాగా పెరిగిపోతోంది. అందులోను మూసేసిన సరిహద్దులను ఎత్తేయటంతో రష్యాలో నుండి ఇపుడు చైనాలోకి వలసలు జోరందుకున్నాయట. దాంతో తమ దేశంలోకి వస్తున్న రష్యన్ల వల్లే కేసులు పెరిగిపోతున్నాయని చైనా మొత్తుకుంటోంది. అందుకనే వైరస్ కేసులను పట్టిస్తే భారీ నజరానాలు ఇస్తామంటూ ప్రకటించింది. మరి బహుమతి ప్రకటనతో ఎంత వరకూ ఉపయోగం ఉంటుందో చూడాలి.